Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సికింద్రాబాద్ – అగర్తలా మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు
Railway Passengers Alert: రైల్వే ప్రయాణీకులకు తీపి కబురు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ - అగర్తలా మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Railway Passenger Alert: రైల్వే ప్రయాణీకులకు తీపి కబురు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SC Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – అగర్తలా మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.07030) సికింద్రాబాద్ నుంచి నవంబరు 08, 15, 22 తేదీల్లో మధ్యాహ్నం 04.35 గంటలకు (సోమవారం) అగర్తలాకు బయలుదేరనుంది. ఈ ప్రత్యేక రైలు గురువారంనాడు వేకువజామున 03.00 గం.లకు అగర్తలా రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది.
అలాగే ప్రత్యేక రైలు (నెం. 07029) నవంబరు 12, 19, 26 తేదీల్లో ఉదయం 06.10 గం.లకు(శుక్రవారం) అగర్తలా నుంచి బయలుదేరి.. ఆదివారం మధ్యాహ్నం 02.50 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.
ప్రత్యేక రైళ్లకు సంబంధించి ద.మ.రైల్వే ట్వీట్
SCR to run Six Special Trains between Secunderabad – Agartala #specialtrains pic.twitter.com/6Ycycmos6R
— South Central Railway (@SCRailwayIndia) November 5, 2021
ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వీటిలో ప్రయాణించేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నేరుగా బుకింగ్ కేంద్రాలు లేదా IRCTC పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు.
రైల్వే శాఖ నడుపుతున్న మరిన్ని ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు enquiry.indianrail.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు.
Also Read..
Maharashtra: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు రోగుల మృతి.. మరో 11 మంది పరిస్థితి విషమం
Shimla: ఐదేళ్ల కుర్రాడిని ఎత్తుకెళ్లిపోయిన వన్య మృగం.. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు..