Hyderabad: దుకాణాల్లో అల్లం వెల్లుల్లి కొంటున్నారా.? మీ ప్రాణాలకే ప్రమాదం సుమా..
ముందుగా అల్లంతో పాటు వెల్లుల్లి సరుకును తీసుకొస్తారు.. వీటిని నీటిలో కడిగిన తర్వాత రెండు సపరేట్ మిషిన్లను ఉపయోగిస్తారు. రెండు మిషన్ల ద్వారా రెండింటికి ఉన్న పొట్టు, తోలు, తొలగిస్తారు.. ఆ తర్వాత అల్లం తో పాటు వెల్లుల్లిని మరో డ్రమ్ములో వేస్తారు. ఈ రెండిటిని కలిపి మిక్స్ చేసి పేస్ట్ చేసేందుకు డ్రమ్ముకు రెండు హ్యాండిల్స్ ని తయారు చేశారు. వీటి లోపల ఉప్పుతోపాటు పసుపు, ఒక తెల్లటి కెమికల్ పౌడర్‌ను కలుపుతారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరింత టేస్ట్...
హైదరాబాద్, ఆగస్టు 25: ఏ కూరలో అయినా అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వేస్తుంటాము. అల్లం వెల్లుల్లి లేని మసాలా వంటకం ఉండదంటే అతిశయోక్తి కాదు.. అంతలో అల్లం వెల్లుల్లి ప్రతిరోజు కూరల్లో తింటూనే ఉంటాము. అల్లం వెల్లుల్లికి ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించి నకిలీ అల్లం వెలుల్లి పేస్టును తయారు చేస్తుంది ముఠా. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో ఒక మారుమూల ప్రదేశంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌను ఏర్పాటు చేశారు. ఈ గొడవను నడుపుతున్నది దిల్దార్ అని వ్యక్తి. గత కొన్ని నెలలపాటు ఇదే ఉప్పరపల్లి ప్రాంతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. హై ఫై గార్లిక్ జింజర్ పేస్ట్ పేరుతో మార్కెట్లోకి వీటిని సరఫరా చేస్తున్నాడు. అసలు ఈ జింజర్ పేస్ట్ ఎలా తయారు చేస్తారో చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఇలా తయారు చేశారు..
ముందుగా అల్లంతో పాటు వెల్లుల్లి సరుకును తీసుకొస్తారు.. వీటిని నీటిలో కడిగిన తర్వాత రెండు సపరేట్ మిషిన్లను ఉపయోగిస్తారు. రెండు మిషన్ల ద్వారా రెండింటికి ఉన్న పొట్టు, తోలు, తొలగిస్తారు.. ఆ తర్వాత అల్లం తో పాటు వెల్లుల్లిని మరో డ్రమ్ములో వేస్తారు. ఈ రెండిటిని కలిపి మిక్స్ చేసి పేస్ట్ చేసేందుకు డ్రమ్ముకు రెండు హ్యాండిల్స్ ని తయారు చేశారు. వీటి లోపల ఉప్పుతోపాటు పసుపు, ఒక తెల్లటి కెమికల్ పౌడర్‌ను కలుపుతారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరింత టేస్ట్ వచ్చేందుకు ఈ తరహా కెమికల్స్‌ని ఉపయోగిస్తున్నారు. అలా తయారైన పేస్టును డబ్బులలో సేవ్ చేసి వీటిని మరో రెండు పరికరాల ద్వారా ప్యాకింగ్ చేసి మార్కెట్లో వీటిని సరఫరా చేస్తున్నారు. వీటికి “హై-ఫై” గార్లిక్ జింజర్ పేస్ట్ స్టిక్కర్ ను పెట్టారు. ఇక్కడ అమర్చిన సామాగ్రిని చూస్తే చాలా సంవత్సరాల పాటు నిందితుడు ఈ వ్యాపారంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఉప్పరపల్లి లో ఒక నిర్మానుష ప్రదేశంలో ఎవరికి అనుమానం రాకుండా ఈ గోడౌన్ నిర్వహిస్తున్నారు.
అంతా బీహారిలే..
ఇంత పెద్ద గోడౌన్ నడపాలంటే కచ్చితంగా యువకులు అవసరం ఉంటుంది కాబట్టి బీహార్ నుంచి యువకులను తీసుకొచ్చాడు నిందితుడు.. వీరికి నెలకు 12,000 నుంచి 14000 రూపాయలు చెల్లిస్తున్నాడు.. ఆ గోడౌన్‌ని పరిశీలించినప్పుడు 8 నుంచి 9 మంది బిహారీ యువకులు తాము అక్కడే పనిచేస్తున్నట్టు చెప్పారు. ఈ బిహారీ యువకులకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అదే గోడౌన్ లో వీరికి షెల్టర్ కల్పించాడు నిర్వాహకుడు. ఈ యువకులకు ఈ పేస్ట్ తయారు చేయడం తప్ప మరే పని లేదు. అయితే కెమికల్ కలుపుతున్నట్టు తమకు ఎలాంటి అవగాహన లేదనీ యువకులు వాపోతున్నారు. తమ యజమాని చెప్పినట్టు తాము చేసామని యువకులు తెలిపారు.
గోడౌన్‌ను సీజ్ చేసిన ఎస్‌ఓటీ పోలీసులు..
గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. పక్క సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిర్వాహకుడు దిల్దారును అరెస్టు చేశారు.. గోడౌన్ నుంచి 4 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు కెమికల్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లలో ఇటువంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులను ఎవరు కొనవద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..