AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మ్యూజిక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. మన భాగ్యనగరంలో ఇళయరాజా లైవ్ కన్సెర్ట్

ఇళయరాజా లైవ్ కన్సెర్ట్‌కు ముచ్చింతల్లోని Statue of Equality (సమతా మూర్తి) ఆధ్యాత్మిక కేంద్రం వేదికకానుంది. జూన్‌ 8, సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేవలం ఆధ్యాత్మిక, భక్తి పాటలే కాకుండా క్లాసికల్ మెలొడీ మ్యూజిక్‎లో తడిసి పరవశించి పోయేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Hyderabad: మ్యూజిక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. మన భాగ్యనగరంలో ఇళయరాజా లైవ్ కన్సెర్ట్
Samatha Ilaiyaragam
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2024 | 12:42 PM

మ్యూజిక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌! మీరు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఇళయరాజా కాన్సర్ట్‌..భాగ్యనగరానికి రానే వచ్చింది. ముచ్చింతల్లోని Statue of Equality వేదికగా ‘సమతా ఇళయరాగం’ LIVE IN CONCERT .. శనివారం సాయంత్రం ఆరుగంటలకు జరుగుతుంది. ఒక్కసారైనా ఇళయరాజాను చూడాలని..ఆయన సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించాలని ఆశపడే అభిమానుల కోరిక తీరబోతోంది. రండి..ఈ వేసవిలో చల్లని స్వరాల జల్లులతో స్నానమాడుదాం! Book My Showలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

అనేక గ్రీష్మాల మధ్య ఒక వర్షం..ఇళయరాజా పాట!… కాలానికి లొంగని..ట్రెండుకు అందని.. నిత్యనూతనం ఆయన ఆలాపన!.  సన్నాయి స్వరాలకు ట్రంపెట్‌ విన్యాసాలు జతచేసి.. సితార్‌ సిత్రాలను బేస్‌ గిటార్‌తో గీటి.. ఇళయరాజా స్వరపరచిన పాటలు అద్భుతం..అనితరసాధ్యం!. ఇళయరాజా కాన్సర్ట్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఆయన్ను ఒక్కసారైనా చూడాలని..ఇసైజ్ఞాని నేతృత్వంలో ఆర్కెస్ట్రా లయ విన్యాసాలను ఆస్వాదించాలని తహతహలాడుతుంటారు. మన జీవితాల్లోని ప్రతి భావోద్వేగాన్నీ తన పాటల్లో నింపిన ఇళయరాజాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆరాటపడుతుంటారు.

ఇప్పుడా భాగ్యం..భాగ్యనగర వాసులకు దక్కింది. ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ వేదికగా.. ‘సమతా ఇళయరాగం’ live in Concert శనివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. వేయి వసంతాల రామానుజులపై ఇళయరాజా కీర్తనలతోబాటు..108 దివ్యదేశమూర్తులపై ఇసై జ్ఞాని ఆలాపనలతో ఆనంద పరవశులయ్యే తరుణం వచ్చింది. అంతేకాదు, గాయనీ గాయకులు ఇళయరాజా హిట్‌సాంగ్స్‌ పాడుతూవుంటే..మన హృదయ లయలు కోరస్‌ కలిపే శుభసమయం రానే వచ్చింది.

మాటే మంత్రం..పాటే బంధం.. ఈ మమతే..ఈ సమతే.. ఇళయ రాగం!. గుర్తుంచుకోండి..జూన్‌ 8వ తేదీ 6 గంటల నుంచి..ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక వేదికగా..సమతా ఇళయరాగం! రండి..ఈ చల్లని స్వరాల జల్లులతో స్నానమాడుదాం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు