Vinayaka Chavithi: ధూల్‌పేటకు చవితి కళ.. జోరందుకు అమ్మకాలు.. మండపాలకు తరలుతున్న వినాయక విగ్రహాలు..

వినాయక చవితి దగ్గర పడుతుండడంతో నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ధూల్‌పేటలో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తుంటారు.

Vinayaka Chavithi: ధూల్‌పేటకు చవితి కళ.. జోరందుకు అమ్మకాలు.. మండపాలకు తరలుతున్న వినాయక విగ్రహాలు..
Chavithi Art To Dhoolpet

వినాయక చవితి దగ్గర పడుతుండడంతో నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ధూల్‌పేటలో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. గత వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. నగరంలోనే గాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మండపాల నిర్వాహకులు ధూల్‌పేట నుంచే విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ధూల్‌పేట రహదారులు కొనుగోలుదారులతో రద్దీగా మారుతున్నాయి. ఇళ్లలో మహిళలు తయారు చేస్తున్న గణనాథులు సైతం పండుగ రెండు రోజుల ముందుగానే పలు కూడళ్లలో అమ్మకానికి ఉంచారు.

ఇక్కడి కళాకారులు విఘ్నేశ్వరుడిని ఎన్నో రూపాల్లో తీర్చి దిద్దుతున్నారు. ముఖ్యంగా దత్తాత్రేయ, శివపార్వతుల మధ్య విఘ్నేశ్వరుడు, హరిహరుడు, సాగర మథనం, డ్రాగన్ చైనా గణేష్, గంగా జమున, ప్రపంచ పటంలో విఘ్నేశ్వరుడు తదితర ఎన్నో రూపాల్లో విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో విక్రయించే విగ్రహాల ధరలతో పోలిస్తే ధూల్‌పేట విగ్ర హాలు తక్కువకే లభిస్తాయి.

వినాయక విగ్రహాలను ఎక్కడ తీసుకోవాలి అనే ఆలోచన రాగానే టక్కున గుర్తొచ్చే పేరు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న దూల్పేట్. ఇక్కడ తయారయ్యే విగ్రహాలను కేవలం హైదరాబాదే కాదు చుట్టుపక్కల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు. అయితే గత సంవత్సరం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా విగ్రహాల తయారీ, క్రయ విక్రయాలు లేకపోవడం తో కళాకారుల ఖాలీగా ఉండిపోయారు.

అయితే ఈసారి మాత్రం కళాకారులు కాస్త పని దొరికినట్లయింది. కరోనాకు మందు దూల్పేట్ విగ్రహాల తయారీ కేంద్రాల్లో వేలల్లో తయారయ్యే విగ్రహాలు ఈసారి మాత్రం వందల్లోకి పడిపోయాయి. సంవత్సరం మొత్తంలో ఒక్కో కార్ఖానాలో కనీసం 300 నుంచి 400 విగ్రహాలు తయారయ్యేది కానీ ఈసారి మాత్రం కేవలం 75 నుంచి 80 విగ్రహాలను మాత్రమే తయారు చేశామని వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని మొత్తంగా 30 శాతం బిజినెస్ మాత్రమే జరిగిందని అంటున్నారు.

దూల్పేట్ లో హోల్ సేల్ గా కోనుక్కొని రిటైల్గా విక్రయించే చిరు వ్యాపారులు మాత్రం ఈసారి వ్యాపారం బానే సాగుతుందని ఆశతో విగ్రహాలను కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు. తమకు ఊహ తెలిసినప్పటి నుంచి గణేష్ విగ్రహాలను ఇక్కడే కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు అంటున్నారు.

సర్వవిఘ్నాలను తొలగించే విగ్నేశ్వరుడు అంటే తమకెంతో భక్తని, దేవుడిచ్చిన వరం గానే మా కొడుకు జన్మించాడని.. అందువల్ల ప్రతి ఏటా పెరుగుతున్న తమ అబ్బాయి వయసుతో పాటు వినాయకుడి ఎత్తు కొద్దికొద్దిగా పెంచుకుంటూ విగ్రహం కొనుగోలు చేస్తామని ఓ మహిళ సంతోషంగా చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు తయారు చేయాలంటే కనీసం ఏడెనిమిది నెలల నుంచి పనులను ప్రారంభించాలని కానీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల క్రితమే అనుమతి రావడంతో ఉన్న పరిధిలో తయారు చేశామని దీనికితోడు షోలాపూర్ లాంటి నగరాలనుంచి నుంచి విగ్రహాల ను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని లోకల్ తయారీదారులు అంటున్నారు. అయితే ధూల్పేటలో ఎంత మంది కళాకారులు ఉన్నారు..

ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నా ధూల్పేట శంకర్ కళాకార్ అంటే చాలా ఫేమస్ అని అందువల్లే తాము ప్రతి సంవత్సరం ఖమ్మం జిల్లా మధిర నుంచి దూల్పేట్ వచ్చి కేవలం శంకర్ కళాకార్ వద్దనే విగ్రహాలను కొనుగోలు చేస్తామని అంటున్నారు. ఇక్కడ తయారుచేసే విగ్రహాల డిజైన్లు, ఫినిషింగ్ చాలా బాగుంటాయి అని అన్నారు. ఈసారి వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది అంటున్నారు శంకర్ కళాకార్ కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు

Click on your DTH Provider to Add TV9 Telugu