Telangana Rains: తెలంగాణపై వరణుడి ప్రతాపం.. జలదిగ్బంధంలో లక్నవరం కేబుల్ బ్రిడ్జి..

Telangana Rains: తెలంగాణపై వరుణుడు గర్జిస్తున్నాడు..రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నాడు... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..

Telangana Rains: తెలంగాణపై వరణుడి ప్రతాపం.. జలదిగ్బంధంలో లక్నవరం కేబుల్ బ్రిడ్జి..
Laknavaram
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 08, 2021 | 6:16 AM

Telangana Rains: తెలంగాణపై వరుణుడు గర్జిస్తున్నాడు..రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నాడు… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..భారీ వర్షాలతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద నీటితో ఉప్పొంగుతోంది. గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామానికి సమీపంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది… భారీగా వరద నీరు వస్తుండటంతో కేబుల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుంది. దాంతో కాటేజీతో పాటు రెస్టారెంట్‎లోకి వరద నీరు చేరింది. అత్యంత ప్రమాదకరంగా నీరు ఉప్పొంగి ఆ ప్రాంతమంతా సముద్రంలా మారింది..లక్నవరం పూర్తి సామర్థ్యం 33ఫీట్లు కాగా, ఇప్పటికే 34.5 ఫీట్లకు చేరుకుంది.. లక్నవరం వైపు వెళ్లే దారులన్నీ ముసుకుపోయాయి.. లక్నవరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడం తో సందర్శకులను అనుమతించడం లేదు.

ఇటు రామప్ప కూడా నిండు కుండలా మారి ఉప్పొంగి ప్రవహిస్తుంది..రామప్ప బ్యాక్ వాటర్‎తో సమీపాన ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. వరద నీరు జాతీయ రహదారిపైకి చేరడంతో వరంగల్-ఏటూరునాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి..అదేవిధంగా మండలంలోని దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కర్లపల్లి శివారు గుండ్లవాగు ప్రాజెక్టు కూడా వర్షాలతో మత్తడి పోస్తోంది. లక్ష్మీపూర్‎లో వర్షాల వల్ల మట్టి గోడలు కూలిపోయాయి. జంగాలపల్లి వద్ద ములుగు జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also read:

Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..

Traffic Challan: టీవీ9 ఎఫెక్ట్.. ట్రాఫిక్‌ చలాన్లపై స్పందించిన జనగామ కలెక్టర్‌.. పెండింగ్ చలాన్లు క్లియర్..!

Hyderabad: ఘరానా మోసం.. ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ చేయిస్తానన్న దొంగబాబా.. 80వేలు సమర్పించుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్..

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!