Traffic Challan: టీవీ9 ఎఫెక్ట్.. ట్రాఫిక్ చలాన్లపై స్పందించిన జనగామ కలెక్టర్.. పెండింగ్ చలాన్లు క్లియర్..!
Traffic Challan: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఎట్టకేలకు జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య స్పందించారు. ఆయన అధికారిక వాహనంపై ఉన్న చలాన్లను వెంటనే క్లీయర్ చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు.
Traffic Challan: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఎట్టకేలకు జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య స్పందించారు. ఆయన అధికారిక వాహనంపై ఉన్న చలాన్లను వెంటనే క్లీయర్ చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. దాంతో అధికారులు కలెక్టర్ వాహనంపై ఉన్న రూ. 22,905 జరిమానాను చెల్లించారు. కాగా, జిల్లా కలెక్టర్‌గా నిఖిల ఉన్న సమయంలో ఈ వాహనంపై 23 చలాన్లు విధించడం జరిగింది. జీబ్రా లైన్ క్రాసింగ్, అతి వేగం, ఇతర కారణాలతో కలెక్టర్ వాహనపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. అయితే, తాజాగా చలాన్ల వ్యవహారంపై టీవీ9 లో వరుసగా ప్రత్యేక కథనాలు ప్రసారం అయ్యారు. గత ఏడాది నుంచి పెండింగ్ చలాన్లు ఉండటాన్ని బహిర్గతం చేసింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన జనగామ కలెక్టర్, అధికార సిబ్బంది.. పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారు.
ఇదిలాఉంటే.. జనగామ జిల్లా కలెక్టర్ తన వాహనానికి ఉన్న చలాన్లను క్లియర్ చేశారు కానీ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందరు కలెక్టర్ల వాహనాలదీ ఇదే పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లా కలెక్టర్ వాహనం(TS03EG 0007)పై రెండు చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు హన్మకొండ కలెక్టర్ వాహనం కూడా సేమ్ టూ సేమ్. TS03EG 0001 నెంబర్ గల ఈ వాహనంపై రెండు చలాన్స్ పెండింగ్‌లో వున్నాయి. TS26B0001 నెంబర్ గల ఈ వాహనం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈ వాహనం పై కూడా ఓవర్ స్పీడ్ చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
కేవలం జిల్లా కలెక్టర్ల వాహనాలే కాదు, జాయింట్ కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్ల వాహనాలపై కూడా పదుల సంఖ్యలో పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. అంతేకాదు జనానికి జరిమానాలు వేస్తున్న పోలీస్ వాహనాలు కూడా స్పీడ్ లిమిట్స్ దాటడంతో జరిమానాలు పడ్డాయి. కానీ వీరెవరూ పెండింగ్ చలాన్స్ కట్టడకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also read:
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు..
Praja Sangrama Yatra: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ పనే చేస్తాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..