Praja Sangrama Yatra: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ పనే చేస్తాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..

Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో మాదిరిగా, తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని..

Praja Sangrama Yatra: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ పనే చేస్తాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..
Bandi Sanjay

Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో మాదిరిగా, తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి మీదుగా సాగుతోంది. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ప్రసంగించిన ఆయన.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రేజర్వేషన్ల వల్ల బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయని, బీసీ లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఓ వర్గం జనాభా విపరీతంగా పెరిగిపోవడం వలన బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా జనాభా నియంత్రణ చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తామని ప్రకటించారు. ‘ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు..’ అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్ల బిల్లును పంపించారు.. దాని సంగతి ఏమైందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంజయ్ ప్రశ్నించారు. ఎంఐఎం వాళ్ళు పోటీ చేయడం కోసమే అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని అనుకున్నారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రికి సంజయ్ సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం మీద పోటీ చేసే ధైర్యం లేదని, బీసీలకు అన్యాయం చేస్తున్న ఎంఐఎం ను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలి..
తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉందన్న బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం మాని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలనే గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ముఖ్యమంత్రిని సంజయ్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిర్మల్‌లో బీజేపీ నిర్వహించబోయే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు నిర్మల్‌కు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లేని దేశాన్ని అస్సలు ఊహించలేమని అన్నారు. టీఆర్ఎస్‌ను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అభివర్ణించిన ఆయన.. అన్ని పదవులు వారి కుటుంబానికే కావాలని ఎద్దేవా చేశారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేంద్రమే ఇచ్చింది..!
భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర యాత్ర స్టార్ట్ చేస్తే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపిపంచారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉద్యోగాలు నోటిఫికేషన్ లు ఇస్తామని చెబుతున్నారు తప్ప.. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు బండి సంజయ్. కానిస్టేబుల్స్ కి జీతాలు ఇవ్వకుండా, పుస్తకాలు ఇచ్చి చందాలు వసూలు చేసుకోమంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున.. రాష్ట్రానికి 2,73,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చామన్న బండి సంజయ్.. తెలంగాణలోని పేదలందరికీ ఇళ్ళు ఇస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంబంధించి లిస్ట్ ఇస్తే.. తాను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్తానని, ఇది తన సవాల్ అంటూ బండి సంజయ్ తీవ్రస్వరంతో అన్నారు. ఇదేసమంలో సూర్యాపేట జెడ్పీ సీఈఓపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జెడ్పీ సీఈఓ ప్రభుత్వం, కార్పొరేట్ కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యోగం చేసే పరిస్థితి లేదన్నారు.

పాదయాత్ర కాదు.. కేసీఆర్‌పై దండయాత్ర..
ఇదిలాఉంటే.. సంయ్ పాదయాత్రలో పాల్గొన్న బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంజయ్ చేసేది పాదయాత్ర కాదని, కేసీఆర్ మీద చేసే దండయాత్ర అని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ నినాదం నీళ్లు, నిధులు, నియమాకాలు కానీ ఇప్పుడు కన్నీరు, అప్పులు, నిరుద్యోగం’ అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. ఈ ధర్మ యుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తేజస్వి. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, టీఆర్ఎస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. యువమోర్చా కార్యకర్తలను చూసి టీఆర్ఎస్ భయపడుతోందన్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ నలుగురు వ్యక్తులది అన్న ఆయన.. బీజేపీ ప్రతీ ఒక్కరిది అని పేర్కొన్నారు.

Also read:

Indian Cricketers: పెళ్లైన మహిళలను వివాహమాడిన క్రికెట్ ప్లేయర్లు వీరే.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Whatsapp Features: వాట్సప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇకపై సెలక్టీవ్‌గా హైడ్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..

Shikhar Dhawan Net Worth: అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో శిఖర్ ధావన్.. సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Click on your DTH Provider to Add TV9 Telugu