Whatsapp Features: వాట్సప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇకపై సెలక్టీవ్‌గా హైడ్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..

Whatsapp Features: ఫేస్ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరినైతే.. హైడ్ చేయాలనుకుంటున్నామో..

Whatsapp Features: వాట్సప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇకపై సెలక్టీవ్‌గా హైడ్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 08, 2021 | 5:44 AM

Whatsapp Features: ఫేస్ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరినైతే.. హైడ్ చేయాలనుకుంటున్నామో.. వారిని మాత్రమే హైడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వివరంగా తెలుసుకున్నట్లయితే.. ఇప్పటి వరకు మనం వాట్సప్ ఓపెన్ చేస్తే ఎదుటి వారి లాస్ట్‌ సీన్(చివరిసారి వాట్సప్ ఎప్పుడు వినియోగించారు అనేది) కనిపిస్తుంది. అయితే, లాస్ట్ కనిపించకుండా చేయాలంటే కేవలం మూడు ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 1. ఎవ్రీ వన్(ప్రతీ ఒక్కరూ చూడొచ్చు), 2. మై కాంటాక్స్(నా కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపించాలి), 3. నో బడీ(ఎవరూ చూడొద్దు) అనే ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

అయితే, ఇకపై ఎంపిక చేసిన కాంటాక్ట్‌లకు మాత్రమే మనం చివరిసారి ఎప్పుడు వాట్సాప్‌ను ఉపయోగించామో తెలియకుండా ఉండేందుకు ఈ ఆప్షన్‌ పని చేస్తుంది. ఈ సరికొత్త హైడ్ ఆప్షన్ ఫీచర్‌ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులో రానుందని వాట్సప్ యాజమాన్య వర్గాలు చెబుతున్నాయి. లాస్ట్ సీన్ మాత్రమే కాదండోయ్.. స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా సెలక్టీవ్‌గా హైడ్ చేసుకునే వెసులుబాటు ఈ ఫీచర్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇదే అంశంపై వాట్సప్ ప్రైవసీ ఫీచర్ సెట్టింగ్‌లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్లలో పరీక్షిస్తున్నారు. త్వరలోనే ఇది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Also read:

Shikhar Dhawan Net Worth: అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో శిఖర్ ధావన్.. సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Visakhapatnam: విశాఖను వణికిస్తున్న సీజన్ వ్యాధులు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..

Visakhapatnam: ప్రేమ పేరుతో వేధింపులు.. వాగులోకి దూకిన బాలిక.. ఇంకా దొరకని ఆచూకీ..