Visakhapatnam: విశాఖను వణికిస్తున్న సీజన్ వ్యాధులు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..

Visakhapatnam: దేశాన్నంతా కరోనా వణికిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖను మాత్రం వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. జిల్లాలో మన్యం మొదలుకొని

Visakhapatnam: విశాఖను వణికిస్తున్న సీజన్ వ్యాధులు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..
Visakhapatnam
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 08, 2021 | 2:44 AM

Visakhapatnam: దేశాన్నంతా కరోనా వణికిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖను మాత్రం వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. జిల్లాలో మన్యం మొదలుకొని మెట్రోపాలిటన్ సిటీ వరకు జనాలంతా మంచాన పడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే విశాఖ జిల్లాలోనే ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖ జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు పంజా విసురుతున్నాయి. జిల్లాలోనీ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ జ్వర పీడుతులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని వైరల్ ఫీవర్లు పట్టి పీడిస్తున్నాయి.

చివరకు జిల్లాలోని కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన నాయకుడు, ఉన్నత విద్యావంతుడైన లోకుల గాంధీనీ సైతం డెంగ్యూ బలిగొంది. డెంగ్యూ బారిన పడ్డ 38 ఏళ్ల లోకుల గాంధీ విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ క్రిందటి నెల మృతి చెందారు. ప్రత్యేకించి విశాఖ నగరంలో, పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజా నివేదిక ప్రకారం.. గత నెలలో 241 నమోదవగా, సెప్టెంబరులో ఆరు రోజుల్లోనే 43 కొత్త కేసులొచ్చాయి. ఆగస్టులో రోజుకు సగటున 8 కేసులుండగా.. ఈ నెలలో అది కాస్తా 10కి మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది మొత్తంగా 462 డెంగీ కేసులు రికార్డవ్వగా.. అందులో 280 డెంగ్యూ కేసులు జీవీఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మలేరియా కేసులు కూడా గతంకన్నా పెరిగాయి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా కేసులు 708 నమోదయ్యాయి. ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా 100కేసులు నమోదు కాగా ఈ నెలలో 10 నమోదయ్యాయి. 31 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి విశాఖలోని కేజీహెచ్లో గత రెండ్రోజుల్లోనే 60 మంది డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలతో వచ్చి చేరారు. వీరు కాకుండా గతకొన్నాళ్లుగా రోజుకు 200 మంది వరకూ జ్వర బాధితులు ఓపీలో చికిత్స చేయించుకుని వెళ్తున్నారు. ఓ వైపు కరోనా.. మరోవైపు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వైరల్ ఫీవర్‌లు జిల్లా వాసులను వెంటాడుతున్నాయి. అన్నింటికీ జ్వరం, దగ్గు కామన్ కావటంతో ఏది కరోనా నో, ఏది డెంగ్యూ వ్యాదో, ఏది మలేరియా నో తెలియక జనాలు సతమతమవుతున్నారు. జ్వరాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలన ఉండాలంటున్నారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. రోగులకు కావాల్సిన ప్లేట్లెట్స్ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కంటే విశాఖ జిల్లాలో విషజ్వరాలు సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో మంగళవారం విశాఖలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఏరీనాలో జిల్లాలోని సీజనల్ వ్యాధులపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు, అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో విషజ్వరాలు ఎక్కువుగా నమోదవుతున్న దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జ్వరాలపై రెగ్యులర్‌గా సర్వే కొనసాగుతుందని, ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టెస్ట్స్ ఎక్విప్‌మెంట, మందులు సిద్దంగా ఉంచాలని చెప్పారు. డెంగ్యూ జ్వరాలను ఆరోగ్య శ్రీ క్రింద సీఎం చేర్చినట్లు మంత్రులు తెలిపారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ సైతం జిల్లాపై ఉండటంతో ఇప్పుడు విషజ్వరాల నియంత్రణ జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఇటు జీవీఎంసీ పరిధితో పాటు అటు రూరల్, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అధికారులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నారు. డెంగ్యూ మలేరియా జ్వరాల నివారణ పట్ల ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.

Also read:

Visakhapatnam: ప్రేమ పేరుతో వేధింపులు.. వాగులోకి దూకిన బాలిక.. ఇంకా దొరకని ఆచూకీ..

Tirumala Temple: తిరుమలలో నేటి నుంచి ఉచిత దర్శనాలు.. అయితే వారికి మాత్రమే అని స్పష్టం చేసిన టీటీడీ..

Shikhar Dhawan Divorces: విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..!

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!