Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: ప్రేమ పేరుతో వేధింపులు.. వాగులోకి దూకిన బాలిక.. ఇంకా దొరకని ఆచూకీ..

Visakhapatnam: విశాఖపట్నంలోని చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులకు తాళలేక ఓ మైనర్ బాలిక వాగులోకి దూకేసింది. ఇప్పటి వరకూ బాలిక ఆచూకీ లభించలేదు.

Visakhapatnam: ప్రేమ పేరుతో వేధింపులు.. వాగులోకి దూకిన బాలిక.. ఇంకా దొరకని ఆచూకీ..
Minor Girl
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 08, 2021 | 2:21 AM

Visakhapatnam: విశాఖపట్నంలోని చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులకు తాళలేక ఓ మైనర్ బాలిక వాగులోకి దూకేసింది. ఇప్పటి వరకూ బాలిక ఆచూకీ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. చోడవరం ప్రాంతానికి చెందిన యువకుడు రాము.. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్ర సమయంలో బాలికను చోడవరంలోని శారదా నది వాగు వద్ద కలిశాడు. అయితే, తనను ప్రేమించాల్సిందిగా సదరు యువకుడు బాలికపై ఒత్తిడి చేయసాగాడు. యువకుడి టార్చర్ తట్టుకోలేకపోయిన బాలిక.. శారదా నది వాగులో దూకేసింది. అయితే, వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాలిక గల్లంతయ్యింది. ఇది గమనించిన స్థానికులు బాలికను కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

బాలిక వాగులోకి దూకిన సమయంలో రాము అక్కడే ఉండటంతో.. అతన్ని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ, అతను తప్పించుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో కలిసి వచ్చారు. వాగులో తీవ్రంగా గాలించారు. అయితే, వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటం, చీకటి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. దాంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం ఉదయమే గాలింపు చర్యలను పునఃప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. తమ కూతురును కాపాడాలని వేడుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Tirumala Temple: తిరుమలలో నేటి నుంచి ఉచిత దర్శనాలు.. అయితే వారికి మాత్రమే అని స్పష్టం చేసిన టీటీడీ..

Shikhar Dhawan Divorces: విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..!

Jr NTR : తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..? వీడియో