- Telugu News Sports News Team India Cricket Player Shikhar Dhawan Net Worth This Indian Cricketer Earnings Brand Endorsement Cars and Houses Interesting Story See Here
Shikhar Dhawan Net Worth: అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో శిఖర్ ధావన్.. సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..
శిఖర్ ధావన్ భారతదేశంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్‌లలో ఒకడు. 2013 నుంచి టీమ్ ఇండియా తరఫున ఆడుతున్నాడు. అలాగే 2008 నుండి ఐపిఎల్ ఆడుతున్నాడు. ఇలా తన స్టార్‌డమ్‌తో అత్యధికంగా సంపాదిస్తున్నాడు.
Updated on: Sep 08, 2021 | 5:30 AM

శిఖర్ ధావన్.. భారత క్రికెట్ జట్టు ఓపెనర్. ప్రస్తుతం ఐపిఎల్-2021 సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ధావన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త ఒక వైరల్ అవుతోంది. శిఖర్ ధావన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ధావన్ భార్య అయేషా ముఖర్జీ.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రమ్ ద్వారా ప్రకటించింది. అయితే స్పష్టంగా పేర్కొనకపోవడం విశేషం. దీనిపై ధావన్ స్పందించాల్సి ఉంది. భారత్ క్రికెట్ జట్టులో గబ్బర్‌గా పిలవబడే ధావన్.. మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. తన సహచర క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఎన్నో మ్యాచ్‌లను సునాయాసంగా గెలిపించాడు. అలా మైదానంలో రెచ్చిపోవడమే కాకుండా.. ఆదాయ పరంగానూ ధావన్ మంచి పొజీషన్‌లో ఉన్నాడు. టీమిండియాలోని ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. మరి శిఖర్ ధావన్ ఆస్తుల నికర విలువ ఎంత? అతను ఎలా సంపాదిస్తున్నాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శిఖర్ ధావన్ ఆస్తుల నికర విలువ దాదాపు రూ .96 కోట్లు. అతని ఆదాయంలో ఎక్కువ భాగం బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా వస్తుంది. దీంతో పాటుగా.. బ్రాండ్‌ల ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. శిఖర్ ధావన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదిస్తాడు. రిలయన్స్ జియో, నెరోలాక్ పెయింట్స్, మ్యూచువల్ ఫండ్స్ సాహి హై, డ్రీమ్ 11, ఫీవర్ ఎఫ్ఎమ్, ఏరియల్ వంటి బ్రాండ్‌ల ప్రకటనలలో నటించాడు.

బీసీసీఐ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో శిఖర్ ధావన్ ఉన్నాడు. దీని ద్వారా, అతను ఏటా ఐదు కోట్ల రూపాయలు లభిస్తాయి. 2019 అతను ఈ కేటగిరీలో ఉన్నాడు. ఇది కాకుండా, భారత జట్టు కోసం ఆడటం ద్వారా మ్యా్చ్ ఫీజ్ అందుకుంటాడు. ప్రస్తుతం ధావన్ వన్డే, టీ 20 క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఇలా ధావన్‌కి బీసీసీఐ ఒక వన్డేకి ఆరు లక్షల రూపాయలు, ఒక టీ20 కి మూడు లక్షల రూపాయలు ఇస్తోంది. అలాగే, మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిస్తే ప్రత్యేక ప్రైజ్ మనీ వేరుగా లభిస్తుంది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో శిఖర్ ధావన్ చోటు దక్కించుకోలేదు. కానీ, ధావన్‌కు బాగానే రేట్ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమైన ధావన్.. ప్రతీ సీజన్‌కు రూ. 5.2 కోట్లు పొందుతాడు. అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న గబ్బర్.. గత రెండేళ్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్నాడు. 2014 నుంచి 2017 మధ్య హైదరాబాద్ జట్టు సభ్యుడిగా ఉన్న ధావన్.. సీజన్‌కు రూ. 12.50 కోట్లు ఆదాయం అందుకున్నాడు. జట్టులో నెంబర్ వన్‌గా నిలిచాడు. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ధావన్.. ఢిల్లీ కోసం దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఆ మ్యా్చ్‌ల ద్వారా కూడా ధావన్ ఆదాయం పొందుతాడు.

శిఖర్ ధావన్‌కు ఢిల్లీలో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ధర దాదాపు ఆరు కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీతో పాటు, అనేక నగరాల్లో కూడా అతని ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ముంబై, గురుగ్రామ్ లో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. ధావన్ భార్య అయేషా ముఖర్జీ, పిల్లలు ఆ ఇంట్లోనే ఉండేవారు. అంతేకాదు.. ధావన్ వద్ద లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి. ఆడి ఏ6, బీఎండబ్ల్యూ 6జీటీ, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ప్రముఖమైనవి. కొద్దిరోజుల క్రితం ధావన్.. కోటి రూపాయల విలువైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేశాడు. అంతేకాదు.. యోగా, వెల్‌నెస్ స్టార్టప్‌లలో కూడా ధావన్ పెట్టుబడి పెట్టాడని సమాచారం.





























