TSRTC: ఇక నుంచి బస్సులపై ప్రకటనలు కనిపించవు.. రూ. 20 కోట్ల ఆదాయాన్ని సైతం వదులుకొని ఆర్టీసీ నిర్ణయం..
TSRTC: ఆర్టీసీ బస్సులపై ప్రకటనలు కనిపించడం సర్వసాధారణం. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ప్లెక్సీలను అంటిస్తుంటారు. వీటి వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. అంచనా ప్రకారం ఈ ప్రకటనల ద్వారా...
TSRTC: ఆర్టీసీ బస్సులపై ప్రకటనలు కనిపించడం సర్వసాధారణం. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ప్లెక్సీలను అంటిస్తుంటారు. వీటి వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. అంచనా ప్రకారం ఈ ప్రకటనల ద్వారా ఆర్టీసీకి ఏకంగా రూ. 20 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జానార్ ఈ ప్రకటనలపై నిషేధాన్ని విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బస్సులపై పోస్టర్లు అతికించరాదని, ఒకవేళ ఎవరైనా అతిక్రమించే పోస్టర్లను అంటిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చింది.
ఇదిలా ఉంటే అంత ఆదాయాన్ని సైతం ఫణంగా పెట్టి మరీ ఆర్టీసీ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. బస్సులపై పోస్టర్లు అంటించడం వల్ల అది ఏ బస్సు అన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. దీంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంటోంది. అంతేకాకుండా ఫ్లెక్సీలను అతికించడం, ప్రకటన గడువు ముగిసిన తర్వాత దానిని తొలగించడంతో బస్సు రూపం కూడా మారుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఆర్టీసీ ఎండీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అంతేకాకుండా కొన్ని సినిమా పోస్టర్ల వల్ల కూడా ఆర్టీసీ ప్రతిష్ట దిగజారుతుందనే వాదన కూడా వినిపించింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలతో కూడిన పోస్టర్‌లను బస్సులపై అతికించడంపై సజ్జనర్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏది ఏమైనా సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో సమూల మార్పులు వస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Civils Free Coaching: సివిల్స్ 2022 పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత కోచింగ్.. దరఖాస్తు తేదీ పొడిగింపు
Airtel vs Jio: ఇప్పుడు ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ ప్యాక్.. జియో ప్యాక్ కంటే ఎంత ఎక్కువ ఖరీదో తెలుసా?