Airtel vs Jio: ఇప్పుడు ఎయిర్‌టెల్‌ ప్రీ పెయిడ్ ప్యాక్.. జియో ప్యాక్ కంటే ఎంత ఎక్కువ ఖరీదో తెలుసా?

భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి.. మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లను దాదాపు 25 శాతం పెంపుతో సవరించింది.

Airtel vs Jio: ఇప్పుడు ఎయిర్‌టెల్‌ ప్రీ పెయిడ్ ప్యాక్.. జియో ప్యాక్ కంటే ఎంత ఎక్కువ ఖరీదో తెలుసా?
Follow us
KVD Varma

|

Updated on: Nov 22, 2021 | 6:33 PM

Airtel vs Jio: భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి.. మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లను దాదాపు 25 శాతం పెంపుతో సవరించింది. నవంబర్ 26 నుండి, మీరు ఎయిర్‌టెల్(Airtel) సేవలను ఉపయోగించడానికి మీ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. “భారతి ఎయిర్‌టెల్ ఎప్పుడూ ప్రతి వినియోగదారుకు మొబైల్ సగటు ఆదాయం (ARPU) 200 రూపాయల నుంచి 300 రూపాయలవరకు ఉండాలని , తద్వారా ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనా కోసం అనుమతించే మూలధనంపై సహేతుకమైన రాబడిని అందించాలనె విధానాన్ని కొనసాగిస్తుంది ” అని ఎయిర్‌టెల్ తెలిపింది. సర్వీస్ ప్రొవైడర్ ఇంకా మాట్లాడుతూ, “ఈ స్థాయి ARPU నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌లలో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను ఎనేబుల్ చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాము. అంతేకాకుండా ఈ ధరల విధానం భారతదేశంలో 5Gని విడుదల చేయడానికి ఎయిర్‌టెల్‌కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.” అని చెప్పింది.

ఇక ధరలు పెంచిన తరువాత ఎయిర్‌టెల్‌ ప్యాక్ లకు.. జియో టారిఫ్ ప్యాక్ లకు మధ్య తేడా ఎలా ఉంఉందొ ఇక్కడ తెలుసుకుందాం.

  • ఎయిర్‌టెల్‌1GB డేటా/రోజు ప్యాక్ ప్రస్తుతం 219 రూపాయల నుంచి 28 రోజులకు 265 రూపాయలు అవుతుంది. జియో(Jio) అదే ప్యాకేజీని 149 రూపాయలకు అందిస్తుంది. కానీ 24 రోజులకు మాత్రమే.
  • ఎయిర్‌టెల్‌లో 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటాతో కూడిన ప్రసిద్ధ ప్యాక్ ఇప్పుడు 249 రూపాయలకు బదులుగా 299 రూపాయలకు అందుబాటులో ఉంటుంది . అదే డేటా ప్యాక్ 28 రోజుల పాటు జియో నెట్‌వర్క్‌లో 199 రూపాయలకు ఇస్తున్నారు.
  • ఎయిర్‌టెల్‌ 449 ప్యాక్ ఇప్పుడు మీకు 56 రోజుల వ్యవధిలో రోజుకు 2GB డేటాతో కలిపి 549 ఖర్చు అవుతుంది. జియోలో ₹599 ప్లాన్ ఉంది కానీ 84 రోజులు పాటు వస్తుంది. దీనిలో రోజుకు 2GB డేటా అందిస్తారు.
  • 84 రోజుల పాటు 2GB డేటాను అందించే ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ 698 ప్యాక్ ఇప్పుడు మీకు839 అవుతుంది. అయితే జియో 888 ప్యాక్ 2GB డేటాను 84 రోజుల పాటు అందిస్తుంది. అయితే, ఇది వినియోగం కోసం అదనంగా 5GB డేటాతో వస్తుంది.

ఇవి కూడా చదవండి: Stock Market: మళ్ళీ పడిపోయిన రిలయన్స్ షేర్ల ధరలు .. భారీగా తగ్గిన మార్కెట్ కాప్.. బజాజ్ గ్రూప్ షేర్లు కూడా.. ఎంతంటే..

IRCTC Ramayan Yatra: రామాయణ సర్క్యూట్ రైల్‌లో వెయిటర్ల దుస్తులపై వివాదం.. ఉజ్జయిని మహర్షుల అభ్యంతరం ఎందుకంటే..