Puneeth Raj Kumar: ‘అప్పు’ జీవితం సినిమా తీయమని కోరుతున్న అభిమాని.. తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న దర్శకుడు

Puneeth Raj Kumar: పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు.. అయితే కొంతమంది మరణించి చిరంజీవులు. తాము చేసిన పనులతో ప్రజల మనసులో సదా నివసిస్తుంటారు. మంచి తనం,..

Puneeth Raj Kumar: 'అప్పు' జీవితం సినిమా తీయమని కోరుతున్న అభిమాని.. తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న దర్శకుడు
Puneeth Raj Kumar
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2021 | 7:27 PM

Puneeth Raj Kumar: పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు.. అయితే కొంతమంది మరణించి చిరంజీవులు. తాము చేసిన పనులతో ప్రజల మనసులో సదా నివసిస్తుంటారు. మంచి తనం, మానవత్వం తో బతికి ఉన్న సమయంలో చేసే పనులతో ప్రజలు మనసులో జ్ఞాపకాలుగా వెలుగుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తిలో ఒకరు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించిన పునీత్ బతికి ఉన్నప్పుడు బహుశా కన్నడ వారికీ మాత్రమే తెలుసు.. అయితే మరణించిన తర్వాత పునీత్ చేసిన మంచి పనులు వెలుగులోకి వచ్చి.. కోట్లాది భారతీయులు  తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన మరణాన్ని తలచుకుని కన్నీరు పెడుతూనే ఉన్నారు.  పునీత్ చేస్తున్న మంచి పనులను తాము కొనసాగిస్తామని కుటుంబ సభ్యులతో పాటు, హీరో విశాల్ వంటివారు కూడా ముందుకొస్తున్నారు.

అయితే తాజాగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ జీవితం వెండి తెరపై సినిమాగా తెరకెక్కడానికి ప్రయత్నాలు మొదలయినట్లు టాక్ వినిపిస్తోంది. నటుడిగా మెప్పించిన అప్పు.. మరోవైపు నిజజీవితంలో అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ… ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు అప్పు బయోపిక్ చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు సంతోష్ కు పునీత్ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇద్దరి కాంబో శాండల్ వుడ్ లో సూపర్ హిట్. ఈ నేపధ్యంలోకి తాజాగా పునీత్‌ అభిమాని సునీల్‌ ట్విటర్‌ వేదికగా పునీత్‌ బయోపిక్‌ చేయాలంటూ దర్శకుడు సంతోష్‌ ఆనందారంను కోరారు.  మీరు అప్పుని ఎంతో దగ్గరగా చూశారు. ఆయన గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు.. ఆయన మనుషుల్ని ప్రేమించే విధానం, నైతిక విలువ గురించి మీకంటే ఎవరికీ తెలియదు.. కనుక సర్ .. అప్పు జీవితాన్ని వెండి తెరపై దృశ్యమాలికగా చూపించండి అంటూ ట్విట్ చేశాడు సునీల్.

సునీల్ ట్విట్ కు స్పందించిన సంతోష్.. తన దృష్టిలో అప్పు సర్ ఎప్పటికి బతికే ఉన్నారని.. అయితే ఆయనని తెరమీద చూపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. పునీత్, సంతోష్ కాంబోలో తెరకెక్కిన ‘రాజకుమార’, ‘యువరత్న’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్న సమయంలో పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Also Read:  ఇన్సులిన్ వాడుతున్న షుగర్ పేషెంట్స్‌కు సైతం మంచి మెడిసిన్.. మెంతులు, మెంతికూర అంటున్న నిపుణులు

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ