Hyderabad: పోలీసుల అదుపులో రూ. 100 కోట్ల డాన్.. ట్రాక్ రికార్డు చుస్తే మతిపోవాల్సిందే..
ఈ పేరు వింటే పేరుమోసిన రౌడీ షీటర్లే హడాలెత్తిపోతారు. ఇతని ట్రాక్ రికార్డు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. స్కూల్ టైం నుంచే చోరీలకు పాల్పడటం అలవాటు చేసుకున్న ఖైసర్. ఇప్పటి వరకు అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే బయటకంటే జైలులోనే ఎక్కువ కాలం గడిపాడు చోర్ ఖైసర్. నేరాలకు పాల్పడటం.. జైలుకు వెళ్లి రావడం చోర్ ఖైసర్ కు అలవాటుగా మారింది.

హైదరాబాద్, అక్టోబర్ 26: మొహమ్మద్ ఖైసర్ అలియాస్ చోర్ ఖైసర్ @ ఖైజర్ @ చోర్ ఖైజర్ @ పహెల్వాన్ ఖైజర్ @ మల్లేపల్లి ఖైజర్.. ఈ పేరు వింటే పేరుమోసిన రౌడీ షీటర్లే హడాలెత్తిపోతారు. ఇతని ట్రాక్ రికార్డు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. స్కూల్ టైం నుంచే చోరీలకు పాల్పడటం అలవాటు చేసుకున్న ఖైసర్. ఇప్పటి వరకు అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే బయటకంటే జైలులోనే ఎక్కువ కాలం గడిపాడు చోర్ ఖైసర్. నేరాలకు పాల్పడటం.. జైలుకు వెళ్లి రావడం చోర్ ఖైసర్ కు అలవాటుగా మారింది.
ఇటీవల గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన యాదిగిరి చోర్ ఖైసర్ కు రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి 2016 సంవత్సరంలో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తన తమ్ముడిని చంపిన వ్యక్తిని చంపవలసిదిగా కోరాడు. కొద్ది రోజుల తర్వాత మనసు మార్చుకున్న యాదిగిరి సదరు వ్యక్తిని చంపవలసిన అవసరం లేదని డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా చోర్ ఖైసర్‌ను అభ్యర్థించాడు. దీంతో ఆగ్రహానికిలోనైన చోర్ ఖైసర్ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని అదనంగా యాదగిరిని రెండు లక్షల రూపాయల డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. భయాందోళనకు గురైన యాదగిరి మూడు దాఫాలో రెండు లక్షల రూపాయల డబ్బును ఖైసర్‌కు చెల్లించాడు. అప్పటికి ఆగని కైసర్ ఇంకా డబ్బులు ఇవ్వాలని లేనిపక్షంలో యాదగిరినే చంపుతానని బెదిరించడంతో యాదగిరి హబీబ్ నగర్ పోలీస్‌లను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు పరారీలో ఉన్న చోరు కైసర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చోర్ ఖైసర్ పై 22క్రిమినల్ కేసులు..
1995నుంచి నేరాలకు పాల్పడుతున్న చోర్ ఖైసర్ పై 22క్రిమినల్ కేసులు నమోదు చేసారు. సుపారీ హత్యలు, సెట్టెల్మెంట్లు, ల్యాండ్ గ్రాబింగ్, చోరీలకు పాల్పడేవాడు. 1995లో ఓ కళ్ళు కాంపౌండ్ లో కక్ష్యాలతో ఆఫ్జాల్ అనే యువకుడిని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన చోర్ ఖైసర్.. అకీల్ అనే స్నేహితుడితో కలిసి ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గ్యాంగ్ రోడ్డు పై ఉండే చిరు వ్యాపారులను బెడరించి డబ్బులు వసులు చేసేది.
రూ. 100కోట్లు సంపాదించినట్లు..
ఎవరైనా ఈ గ్యాంగ్ కు ఎదురు తిరిగితే దాడులు లేదంటే.. హత్యలు చేసి భయబ్రాంతులకు గురించేసేవారు. ఇలా అక్రమాలకు పాల్పడండి రూ. 100కోట్లు సంపాదించినట్టు గుర్తించారు పోలీసులు. 2011లోనే చోర్ కైసర్ ను నగర బహిష్కరించిన అయన ఆగడలు తగ్గలేదు. అండర్ గ్రౌండ్ లోనే ఉంటూ తన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడేవాడు చోర్ కైసర్. మళ్ళీ తన నేర సామ్రాజ్యన్ని విస్తరించడం తో 2014లో అతని పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కతకటల్లోకి నెట్టారు హైదరాబాద్ పోలీసులు.
మరోవైపు చోర్ ఖైసర్ బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సూచిస్తున్నారు పోలీసులు. మరోవైపు చోర్ ఖైసర్ అనుచరులు 100మందికి పైగా ఉంటారని.. గంజాయి, చైన్ స్నాచింగ్, కబ్జాలకు పాల్పడే అతని అనుచరుల పై నిఘా ఉంచినట్టు తెలిపారు పోలీసులు.. ఇలాంటి రౌడీ షీటర్ పై ఫిర్యాదు చేస్తే చట్టపరంగా మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు హైదరాబాద్ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




