AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేభారత్‌ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విశాఖ వెళ్లే రైలు మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే.?

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ముఖ్య గమనిక. గత రెండు రోజులుగా సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

వందేభారత్‌ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విశాఖ వెళ్లే రైలు మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే.?
Vande Bharat Express
Ravi Kiran
|

Updated on: Jun 15, 2023 | 1:37 PM

Share

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ముఖ్య గమనిక. గత రెండు రోజులుగా సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ ఉదయం 5.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన వందేభారత్ లేటులో నడుస్తుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరిగి బయల్దేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యంగానే నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 20834 ట్రైన్ నెంబర్ సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని రైల్వే అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

నిన్న తాడి-అనకాపల్లి మధ్య గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో.. ట్రాక్ మరమ్మత్తుల నిమిత్తం పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో వందేభారత్ సర్వీసులు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు జూన్ 15న నాందేడ్-విశాఖపట్నం(20812) ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు జరిగింది. నాందేడ్‌లో ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు బదులుగా.. రాత్రి 7.25 గంటలకు బయల్దేరుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.