Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తత అవసరం..
తెలంగాణ రాష్ట్రంలో ఏడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 12 జిల్లాలకు ఎల్లో అల్లర్ట్ జారీ చేసింది. కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది.
అదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ దక్షిణ దిశగా ఉపరితల గాలులు వీస్తున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద, పురాతన భవనాల వద్ద ఉండవద్దు అని అధికారులు హెచ్చరికలు జాబ్ చేస్తున్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ప్రస్తుత ఉష్ణోగ్రతలు 26°C నుండి 22°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.