Global Safety Summit: మైహోమ్ రామేశ్వర్ రావుకు మరో అరుదైన గౌరవం.. అంతర్జాతీయ అవార్డు
మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. నిర్మాణ రంగంలో తమదైన ముద్ర వేస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని పొందిన మై హోమ్ సంస్థకు ఈసారి ఏకంగా అంతర్జాతీయ అవార్డు వరించింది. నిర్మాణ రంగంలో జూపల్లి రామేశ్వర్ రావుకు గ్లోబల్ సస్టెనబిలిటీ లీడర్ అవార్డ్ దక్కింది. ఈ అంతర్జాతీయ అవార్డును...
మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. నిర్మాణ రంగంలో తమదైన ముద్ర వేస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని పొందిన మై హోమ్ సంస్థకు ఈసారి ఏకంగా అంతర్జాతీయ అవార్డు వరించింది. నిర్మాణ రంగంలో జూపల్లి రామేశ్వర్ రావుకు గ్లోబల్ సస్టెనబిలిటీ లీడర్ అవార్డ్ దక్కింది. ఈ అంతర్జాతీయ అవార్డును జులై 21వ తేదీన స్వీకరించనున్నారు.
లండన్‌లో జరగనున్న గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సెర్మనీలో ఈ అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది. జులై 21వ తేదీ (శుక్రవారం) లండన్‌లోని యూకే పార్లమెంట్ హౌజ్, పీర్స్ డైనింగ్ రూమ్‌లో సమ్మిట్ జరగనుంది. లండన్ కాలమాన ప్రకారం సాయంత్రం 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఇనాగ్రేషన్ సెర్మనీతో కార్యక్రమం ప్రారంభం కానుంది.
అనంతరం 6.45 గంటల నుంచి 8.00 గంటల వరకు ఈహెచ్‌ఎస్ అండ్ ఈఎస్‌జీ అంశాలపై ప్యానల్ చర్చ జరుగుతుంది. 8 గంటల తర్వాత అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమానికి యూనైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు లార్డ్ బెర్నన్ కేసీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..