Telangana Politics: ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..

జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రేవ్ పార్టీ అని, బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అని వాదిస్తున్నాయి. బీజేపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. పోలీసుల విచారణలో ఏం తేలనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Telangana Politics: ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..
Janwada Farmhouse Case
Follow us

|

Updated on: Oct 28, 2024 | 9:34 AM

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై పొలిటికల్‌ ఫైట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఫామ్ హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. సీసీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అటు.. ఫ్యామిలీ పార్టీని రేవ్‌ పార్టీగా ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, బీజేపీపై బీఆర్ఎస్‌ భగ్గుమంది. ఇంతకీ.. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీనా?.. రేవ్‌ పార్టీనా?.. అసలు.. మొత్తం ఎపిసోడ్‌పై పోలీసు ఎంక్వైరీలో ఏం తేలబోతోంది?..

తెలంగాణ పాలిటిక్స్‌ ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే.. గత రెండు, మూడు రోజులుగా దీపావళి పండుగ వేళ పొలిటికల్‌ బాంబులు పేలతాయన్న మంత్రి పొంగులేటి కామెంట్స్‌ కాక రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య పొలిటికల్‌ బాంబులు టార్గెట్‌గా మాటలయుద్ధాలు నడుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సడెన్‌గా జన్వాడ ఫామ్‌ హౌస్‌ పార్టీ ఇష్యూ తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. దాంతో.. బీఆర్ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ నాయకులు విరుచుకుపడ్డారు. డ్రగ్స్‌ కల్చర్‌కు వ్యతిరేకమని చెప్పిన బీఆర్ఎస్‌ నేతలు.. ఫామ్‌ హౌస్‌ పార్టీ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌.

కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్లాన్‌ ప్రకారం ఫామ్‌ హౌస్‌ పార్టీని కాంగ్రెస్‌ నేతలు వివాదాస్పదంగా మార్చారని ఆరోపించారు మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ఈ ఎపిసోడ్‌ మొత్తంలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇక.. ఫామ్‌ హౌస్‌ పార్టీ అంశంలో రాజకీయాలకు అతీతంగా చట్టప్రకారం వ్యవహరించాలన్నారు టీ.బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. ప్రభుత్వ పాలనతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలు దిగడం కాదని నిజాన్ని నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.

జన్వాడ ఫామ్‌ హౌస్‌ వ్యవహారంలో సీరియస్‌గా ఎంక్వైరీ జరగాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌. ఫామ్‌ హౌస్‌లో ఏం జరిగిందో తేలాలంటే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలావుంటే.. ఫామ్‌ హౌస్‌ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్‌ నేతలు. కొత్తగా ఇళ్లు కట్టుకుని ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే.. రేవ్‌ పార్టీ అని ప్రచారం చేస్తారా అని మండిపడ్డారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు చెప్తోన్న పొలిటికల్ బాంబులు ఇవేనా?.. అని ప్రశ్నించారు.

మొత్తంగా.. జన్వాడ ఫామ్‌ హౌస్‌ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రేవ్‌ పార్టీ అని కాంగ్రెస్‌.. కాదు.. ఫ్యామిలీ పార్టీ అంటూ బీఆర్ఎస్‌.. మధ్యలో సీసీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తు్న్న నేపథ్యంలో.. అసలు.. ఫామ్‌హౌస్‌ పార్టీపై పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..