AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేలానికి సిద్ధమైన అరుదైన గోల్కొండ వజ్రం.. భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్న నిజాం వారసులు

గోల్కొండలో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం వేలానికి సిద్దమైంది. న్యూయార్క్‌‌లోని ఫార్చనా ఆక్షన్‌ హౌస్‌లో ఈ వజ్రాన్ని వేలం వేస్తున్నారు.

వేలానికి సిద్ధమైన అరుదైన గోల్కొండ వజ్రం.. భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్న నిజాం వారసులు
Balaraju Goud
|

Updated on: Feb 16, 2021 | 7:23 PM

Share

Golconda diamonds auction : గోల్కొండలో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం వేలానికి సిద్దమైంది. న్యూయార్క్‌‌లోని ఫార్చనా ఆక్షన్‌ హౌస్‌లో ఈ వజ్రాన్ని వేలం వేస్తున్నారు. 3.05 క్యారెట్ల వజ్రం కోటిన్నర రూపాయలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ వజ్రాన్ని భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిజాం వారసులు కోరుతున్నారు.

కుతాబ్ షాహి కాలంలో గోల్కొండ నుండి తవ్విన నిజాం శకం వజ్రాలను, అనేక విలువైన కళాఖండాలు న్యూయార్క్‌లోని ఫార్చనా ఆక్షన్‌ హౌస్‌ వద్ద వేలం వేయనున్నారు. గోల్కొండ డైమండ్స్ అని పిలువబడే వజ్రాలు మచ్చలేని విలువైన రాళ్లను వేలంపాటదారుల కోసం ప్రదర్శిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఈ డైమండ్‌ విలువ లక్షా 50 వేల నుంచి రెండు లక్షల డాలర్లు పలికే అవకాశముంది. గోల్కొండ నవాబులకు 23 వజ్రాల గనులు ఉండేవి. గోల్కొండలో లభించిన వజ్రాలను కొనడానికి అప్పట్లో బ్రిటీష్‌, డచ్‌ ‌వర్తకులు ఆశపడ్డారు. ఈ డైమండ్‌రింగ్‌ వేలం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ డైమండ్‌లో నైట్రోజన్‌ ఉనికి ఉండదు.. పసుపు రంగులో మెరిసిపోతుంటాయి.

ఫార్చునా ఆక్షన్‌ హౌస్‌లో ఇలాంటి డైమండ్స్‌ కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. దక్కన్‌ సాంప్రదాయాన్ని ప్రతిబింబిందే ఈ వజ్రాలు చాలా ఏళ్ల క్రితమై హైదరాబాద్‌ను, భారత్‌ను దాటాయి. విదేశీ మ్యూజియంలో ఉన్న ఈ వజ్రాన్ని ఇప్పడు వేలం వేస్తున్నారు. ఈ వజ్రానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.

200 ఏళ్ల క్రితమే గోల్కోండ వజ్రం గనులను మూసేశారు. అయినప్పటికి అలనాటి వజ్రాల విలువ పెరిగిందే కాని తగ్గలేదు. ఇలాంటి అపురూప సంపదను భారత్‌కు తీసుకురావాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు, నిజాం వారసులు కోరుతున్నారు.

మనదేశానికి చెందిన అపరూపమైన సంపద విదేశాలకు తరలిపోతోందని రాయల్టీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎస్టేట్స్‌ ప్రతినిధి నవాబ్‌ షఫాత్‌ అలీఖాన్‌ అన్నారు. గోల్కొండ వైభవాన్ని భావితరాలకు వివరించేందుకేఉ మనదేశం ఈ వేలంలొ పాల్గొని డైమండ్‌ను దక్కించుకోవాలని కేంద్రప్రభుత్వం కోరుతున్నారు.

Read Also..  సామాన్యులకు ఊరటను ఇచ్చిన మేఘాలయ ప్రభుత్వం.. భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.!