ఓటుకు నోటు కేసుః నిందితులపై అభియోగాలు నమోదు.. ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేయనున్న ఏసీబీ కోర్టు

ఓటుకు నోటు కేసులో విచారణ వేగవంతం చేసింది హైదరాబాద్ ఏసీబీ కోర్టు. ఈ కేసుకు సంబంధించి నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.

ఓటుకు నోటు కేసుః నిందితులపై అభియోగాలు నమోదు.. ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేయనున్న ఏసీబీ కోర్టు
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 16, 2021 | 6:26 PM

vote note case : ఓటుకు నోటు కేసులో విచారణ వేగవంతం చేసింది హైదరాబాద్ ఏసీబీ కోర్టు. ఈ కేసుకు సంబంధించి నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. మరోవైపు ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూల్‌ను కోర్టు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్‌పై ఏసీబీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. రేవంత్‌రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బీ రెడ్ విత్ 34 అభియోగం నమోదు చేసింది. మరోవైపు, తమపై అభియోగాల్లో నిజం లేదని రేవంత్‌తో పాటు ఇతర నిందితులు తోసిపుచ్చారు. కాగా, సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే ఏసీబీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఇదిలావుంటే ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలను ఏసీబీ కోర్టు ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషనర్ తరపున న్యాయస్థానంలో ప్రశాంత్ భూషణ్ వాదనలు విన్పించారు. ఈ అంశంపై కచ్చితమైన విచారణ తేదీని ప్రకటించాలని కోరగా.. లిఖితపూర్వక ఆదేశాల్లో స్పష్టం చేస్తామన్నారు.

Read Also…  వైద్యశాఖ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ సమీక్ష.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం