వైద్యశాఖ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ సమీక్ష.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం

K Sammaiah

K Sammaiah |

Updated on: Feb 16, 2021 | 5:44 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ మేరకు వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచేలా కార్యాచరణ ప్రణాళికను..

వైద్యశాఖ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ సమీక్ష.. ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ మేరకు వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. నేషనల్ ఫ్యామిలి హెల్త్ సర్వే-5 (NHSF-5) ప్రకారం కొన్ని అంశాలలో మెరుగుదల కోసం చేపట్టవలసిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేడు బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మహిళలకు గర్భస్థ పరీక్షలు, అనిమియా, పుట్టిన గంటలోగా తల్లిపాలపై అవగాహన, మహిళలు, తల్లులలో పౌష్టిక ఆహారం లోపనివారణ, తదితర అంశాలపై దృష్టి సారించాలని సి.యస్ ఆదేశించారు. సర్వేలో వెల్లడించిన అంశాలను విశ్లేషించి వివిధ పారామీటర్లలో మెరుగుదల కోసం అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సామ్‌రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకటి కరుణ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, డైరెక్టర్, IPM డా. కె.శంకర్, టెక్నికల్ అడ్వైజర్ డా. టి. గంగాధర్, CESS డైరెక్టర్ ప్రోఫేసర్ E.రేవతి, CEGIS సెంటర్ హెడ్ రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more:

ముందు షర్మిల వస్తది.. తర్వాత వారొస్తారు.. తస్మాత్‌ జాగ్రత్త.. మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యాఖ్యలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu