ప్రధాని మోదీతో రఘురామకృష్ణంరాజు భేటీ.. ఆ టెండర్లపై ప్రధాని ఆశ్చర్యపోయారన్న వైసీపీ ఎంపీ

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో వరుసబెట్టి బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన..

ప్రధాని మోదీతో రఘురామకృష్ణంరాజు భేటీ.. ఆ టెండర్లపై ప్రధాని ఆశ్చర్యపోయారన్న వైసీపీ ఎంపీ
Follow us

|

Updated on: Feb 16, 2021 | 6:11 PM

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో వరుసబెట్టి బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సంచలన ప్రకటన చేశారు. తాజాగా ప్రధాని మోదీతో రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రధాని దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

రాజధాని అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, దేవాలయాలపై దాడులు, మత మార్పిడులు తదితర అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు మీడియాతో మాట్లాడుతూ రఘురామరాజు తెలిపారు. తాను చెప్పిన అన్ని విషయాలను సావధానంగా విన్న మోదీ… ఒక విషయంలో మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చెప్పారు.

ఏపీలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని చెప్పగానే ప్రధాని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని రఘురామ అన్నారు. చర్చిల నిర్మాణానికి టెండర్లా? అని ప్రశ్నించారని చెప్పారు. ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని అన్నారని తెలిపారు. టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వమని అడిగారని చెప్పారు. త్వరలోనే ప్రధానికి ఆ వివరాలు అందజేయనున్నట్లు తెలిపారు.

Read more:

ముందు షర్మిల వస్తది.. తర్వాత వారొస్తారు.. తస్మాత్‌ జాగ్రత్త.. మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యాఖ్యలు