సామాన్యులకు ఊరటను ఇచ్చిన మేఘాలయ ప్రభుత్వం.. భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.!

Petrol And Diesel Prices: మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ రేట్లను దృష్టిలో ఉంచుకుని..

సామాన్యులకు ఊరటను ఇచ్చిన మేఘాలయ ప్రభుత్వం.. భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2021 | 7:25 PM

Petrol And Diesel Prices:సామాన్యులకు ఊరటను ఇస్తూ మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై రూ. 5 మేరకు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సంగ్మా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ తగ్గించిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని.. జిల్లాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.

కాగా, అంతకుముందు మేఘాలయా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 మేరకు తగ్గించిన సంగతి తెలిసిందే. దానితో పాటు తాజాగా కూడా మరింతగా తగ్గడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించిందని చెప్పాలి. కాగా, దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోల్ ధర రూ. 100 మార్క్ దాటేసింది.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!