Hyderabad: సిటీలో టేస్టీ హలీం దొరికే 12 బెస్ట్ స్పాట్స్ ఇవే…
హైదరాబాదీ హలీమ్ అంటే ఇప్పుడో బ్రాండ్! జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను సొంతం చేసుకున్న హైదరాబాదీ డిష్! ఇరాన్ నుంచి వచ్చినా..మన దగ్గరే మషూర్ అయిపోయింది! అంతేకాదు, హలీమ్ అంటే.. గంగా జమునా తహ్‌జీబ్..! అబ్ బన్‌గయీ..హైదరాబాద్ కీ చార్ సౌ సాల్ పురానీ నిషానీ..!

రంజాన్ వచ్చేసింది, హైదరాబాద్ వీధులన్నీ హలీం భట్టీలతో సందడి చేస్తున్నాయి!. ద లెజెండరీ క్విజిన్ ఆఫ్ పర్షియా పేరుతో పరిచయమైన హరిస్.. ఇక్కడి అభిరుచికి అనుగుణంగా హలీంగా మారింది. తర్వాత మన ఇంటి వంటగా నిలిచింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న హలీం అంటే అందరికీ నోరూరుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో దీని సందడే వేరు.
రంజాన్ నెల ప్రారంభమైందంటే నమాజులు, ఉపవాసాలతో పాటు ఘుమఘుమలాడించే హలీం కూడా గుర్తొస్తుంది. అయితే ఈ ఏడాది హలీం రేటు కొండెక్కి కూర్చుంది. పెరిగిన నిత్యావసరాలు, మాంసం రేట్ల ప్రభావం హలీంపై కూడా పడింది. దీంతో రేట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పిస్తా హౌస్ కూడా తనదైన రుచులతో హలీం సిద్ధం చేసింది. సంప్రదాయ హలీమ్ ప్రధానంగా రెండు రకాలు.. ఒకదాంట్లో మాంసంతో పాటు గోధుమ, బార్లీ, మసాలా దినుసులు వాడితే.. రెండో రకంలో వేర్వేరు పప్పు ధాన్యాలు వాడతారు. ఒక కప్పు హలీంలో 365 గ్రాముల క్యాలరీలుంటాయి. కొవ్వు 17 గ్రాములంటే కొలెస్ట్రాలు 51 మిల్లీగ్రాములు… సోడియం 580 మిల్లీగ్రాములైతే … పొటాసియం 410 మిల్లీగ్రాములు.. కార్బోహైడ్రేట్లు 30 గ్రాములైతే డైటేరీ ఫైబర్ 9 గ్రాములు.. షుగర్ 3 గ్రాములైతే.. ప్రోటినులు 28 గ్రాములు లభిస్తాయి. ఇంతటి పౌష్టికరమైన హలీంను తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. ఈ మాసంలో హలీం పేరుతో జరిగే బిజినెస్ కూడా కోట్లలో ఉంటుంది. ఏ సెంటర్ తీసుకున్నా..జనంతో కిక్కిరిసిపోతూ కనిపిస్తుంది. క్వాలిటీని బట్టి ఒక ప్లేట్ సుమారు 200 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే దాదాపు రెండువేల కోట్ల వరకు బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా హలీం తింటారు.హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హలీం బట్టీలు కనిపిస్తున్నాయి. ఒక్క పాతబస్తీలోనే వందల కొద్ది హలీం షాపులు ఏర్పాటు చేశారు. ఆర్డర్ ఇస్తే ఆన్‌లైన్‌లో ఏకంగా ఇంటికే హలీంను పంపిస్తున్నారు. నగరంలో 5 వేలకు పైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. హైదరాబాద్‌లో తయారైన హలీం… సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియాలతో పాటు అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. రంజాన్ మాసంలో కోట్లాది రూపాయల హలీం వ్యాపారం జరుగుతుంది. అటు రంజాన్ మాసపు శోభ…ఇటు హలీం బట్టీల సందడితో నగరంలో పండగ వాతావరణం కనిపిస్తోంది.
మీలో చాలా మంది ఇప్పటికే నగరంలోని వివిధ ప్రదేశాలలో రుచికరమైన హలీమ్‌ను ఎంజాయ్ చేసే ఉంటారు. హైదరాబాద్‌లో టేస్టీ హలీం అందించే.. టాప్ 12 రెస్టారెంట్స్ ఇవే…




