ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

సంక్రాంతి సందడి మొదలైంది.. పట్టణంలోని జనం పల్లెబాట పట్టారు.. అందరూ ఊళ్లకు పయనమవుతుండటంతో హైదరాబాద్‌ రహదారులు కిటకిటలాడుతున్నాయ్‌.. ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షలాది మంది జనం.. సొంతూర్లకు క్యూకట్టారు. దీంతో హైదరాబాద్‌ రోడ్లు ఎక్కడికక్కడ జామ్‌ అవుతున్నాయ్‌.. ఈ క్రమంలోనే..

ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు
Rajiv Gandhi International Airport Hyderabad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2025 | 6:06 PM

సంక్రాంతి సందడి మొదలైంది.. పట్టణంలోని జనం పల్లెబాట పట్టారు.. అందరూ ఊళ్లకు పయనమవుతుండటంతో హైదరాబాద్‌ రహదారులు కిటకిటలాడుతున్నాయ్‌.. ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షలాది మంది జనం.. సొంతూర్లకు క్యూకట్టారు. దీంతో హైదరాబాద్‌ రోడ్లు జామ్‌ అవుతున్నాయ్‌.. ఎక్కడచూసినా.. ఏ రోడ్డును చూసినా.. హెవీ రష్‌. కనిపిస్తోంది. మెయిన్‌గా హైదరాబాద్‌, విజయవాడ హైవేపై ఉదయంతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర వాహనాలు మెల్లి మెల్లిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారులే కాదు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయ్‌. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) కీలక ప్రకటన జారీ చేసింది..

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని.. ప్రయాణికులు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

పండుగల సీజన్ సమీపిస్తున్నందున, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని విమానాశ్రయం కోరింది. ఊహించిన దాని కంటే ఎక్కువ రద్దీ కారణంగా, ప్రయాణికులు దేశీయ విమానాలకు 2 గంటల ముందు, అంతర్జాతీయ బయలుదేరే 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారలుు సూచించారు.

ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత తమ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని.. కాంటాక్ట్‌లెస్ ప్రయాణ అనుభవం కోసం డిజియాత్ర సేవను ఉపయోగించుకోవాలని విమానాశ్రయం సిఫార్సు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..