AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain In Telangana: రాత్రంతా వర్షం. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. తెలంగాణలోని ఈ ప్రదేశాల్లో నేడు భారీ వర్ష సూచన.

Rain In Telangana: హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి మద్దయింది. ఇక ఉష్ణోగ్రత 25 డిగ్రీలకంటే తక్కువ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా..

Rain In Telangana: రాత్రంతా వర్షం. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. తెలంగాణలోని ఈ ప్రదేశాల్లో నేడు భారీ వర్ష సూచన.
Rain In Hyderabad
Narender Vaitla
|

Updated on: Jul 02, 2021 | 7:25 AM

Share

Rain In Telangana: హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి మద్దయింది. ఇక ఉష్ణోగ్రత 25 డిగ్రీలకంటే తక్కువ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు నాలలను తెరిసి రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించే పనిలో పడ్డారు. రాత్రంతా వర్షం కురుస్తున్న కారణంగా నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆయాప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్ కావడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక శుక్రవారం కూడా నగరంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజంతా ఆకాశం మేఘావృతమై పలు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. కుమరం భీం, అసీఫాబాద్‌, మంచిర్యాల్, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్‌ (రూరల్‌), వరంగల్ (అర్బన్‌), కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశాలున్నాయని, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లిలో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.

Also Read: Jigelu Rani: రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ చేస్తున్న జపాన్ జిగేల్ రాణి..!

Petrol And Diesel Price: పెట్రోల్‌తో పోటీగా పెరుగుతోన్న డీజిల్‌ ధరలు.. హైదరాబాద్‌లో రూ. వందకు చేరువలో లీటర్‌ డీజిల్‌.

Gold and Silver Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు