Jigelu Rani: రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ చేస్తున్న జపాన్ జిగేల్ రాణి..!

రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలుసుగా.. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గడంలేదు.

Jigelu Rani: రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ చేస్తున్న జపాన్ జిగేల్ రాణి..!
Jigelu Rani
Follow us
Venkata Chari

|

Updated on: Jul 02, 2021 | 7:04 AM

Jigelu Rani: రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలుసుగా.. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గడంలేదు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే తో రామ్ చరణ్ చిందులేసిన ఊరమాస్ సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిగేలు రాణి’.. థియేటర్లో ప్రేక్షకులతో కూడా స్టెప్పులేపించింది. యూట్యూబ్ లో కూడా పలువురు ఈ పాటకు స్టెప్పులేస్తూ.. వీడియోలను పోస్ట్ చేశారు. అయితే, తాజాగా జపాన్ లో ఈ పాట సంచలనం క్రియోట్ చేస్తోంది. ఓ జంట ఈ సాంగ్ కు అద్భుతమైన స్టెప్పులేసి యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో స్టెప్పులేసిన వారెవరోకాదు.. జపాన్ హీరోమునిరు, ఆయన సోదరి అశాహి ససాకీ. దీంతో అక్కడ ఈ పాట ట్రెడింగ్ లో కొనాసాగుతోంది. అయితే వీరు జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ లతో ఫేమస్ అయిన వీరు.. మరోసారి చెర్రీ పాటతో సంచలనం చేస్తున్నారు. రామ్‌చరణ్‌, పూజాహెగ్డే వేసిన స్టెప్పులనే వీరు దించేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. భలే స్టెప్పులు వేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.

ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.

ఇండియన్ డిష్ జిలేబి కి ఫుల్ క్రేజ్..వైరల్ అవుతున్న జిలేబి సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో :Jalebi Baby song video.