Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరిలు.. కట్ చేస్తే, దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందిగా..

ఆరుగురు యువకులు నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 17 సెకన్ల క్లిప్‌లో యువకులు హైవే మధ్యలో ప్రమాదకరంగా.. స్టంట్ చేయడం చూపిస్తుంది.

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరిలు.. కట్ చేస్తే, దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందిగా..
Hyderabad Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 10, 2024 | 10:14 AM

హైదరాబాద్ నగరంలో పోకిరిలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉన్న రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ.. వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా.. రోడ్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొందరు చేసే.. ఇలాంటి స్టంట్స్ తో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయని నగర వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. రోడ్లపై స్టంట్స్ చేస్తున్న వారి బెండు తీశారు హైదరాబాద్ పోలీసులు.. జాతీయ రహదారిపై ప్రమాదకర బైక్‌ స్టంట్స్‌ చేస్తున్న ఆరుగురు యువకులను హైదరాబాద్‌ రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని టి-హబ్‌ సమీపంలో ద్విచక్రవాహనదారులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ వాహనదారులను వణికించారు.

ఆరుగురు యువకులు నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 17 సెకన్ల క్లిప్‌లో యువకులు హైవే మధ్యలో ప్రమాదకరంగా.. స్టంట్ చేయడం చూపిస్తుంది.

వీడియో చూడండి..

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్టంట్లు చేసిన ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. అంతేకాకుండా రెండు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పోకిరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు హైదరాబాద్ పోలీసులను కోరుతున్నారు. కావాలని కొందరులు ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని.. పోలీసులు ఇలాంటి వాటిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.

అంతకుముందు కూడా.. ఇలాంటి స్టంట్లు చేస్తూ.. ప్రయాణికులను, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన వారిని పోలీసులు అరెస్టు చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ.. కొందరు యువకులు ఇలాంటి స్టంట్లు నడిరోడ్డుపై చేస్తూ రెచ్చిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..