Telangana: పైకి చూడటానికి వట్టి గ్యాస్ సిలిండర్లే.. కానీ లోగుట్టు ఏంటో తెలిస్తే.!

మత్తును చిత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. అంతర్రాష్ట్ర ముఠాలు ఎదేచ్చగా చెలరేగిపోతున్నాయి. వివిధ రకాల ప్లాన్లు, కొత్త కొత్త పద్దతులతో మత్తు పదార్ధాల అక్రమ రవాణాను సరిహద్దులు దాటిస్తున్నాయి. ఈ దందాను..

Telangana: పైకి చూడటానికి వట్టి గ్యాస్ సిలిండర్లే.. కానీ లోగుట్టు ఏంటో తెలిస్తే.!
Gas Cylinder
Follow us

|

Updated on: Feb 10, 2024 | 10:28 AM

మత్తును చిత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. అంతర్రాష్ట్ర ముఠాలు ఎదేచ్చగా చెలరేగిపోతున్నాయి. వివిధ రకాల ప్లాన్లు, కొత్త కొత్త పద్దతులతో మత్తు పదార్ధాల అక్రమ రవాణాను సరిహద్దులు దాటిస్తున్నాయి. ఈ దందాను కొనసాగించేందుకు తమ పంథాను ఎప్పటికప్పుడు మార్చుతున్న నేరగాళ్లు.. ఈసారి ఏకంగా వాహనాల్లో వాడే సీఎన్‌జీ సిలిండర్లను వాహకాలుగా ఉపయోగించారు. మన పోలీసులు ఏమైనా తక్కువ.. దెబ్బకు వారి ఆటలు కట్టించిన.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పుష్ప తరహా మాదిరిగా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా.. మత్తు పదార్ధాలను రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించిన ఓ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు మేడ్చల్ ఎస్‌ఓటీ పోలీసులు. ఏపీలోని విశాఖపట్నంలో సుమారు 65 కిలోలు గంజాయి కొనుగోలు చేసిన ఈ ముఠా.. దానంతటిని సీఎన్‌జీ సిలిండర్లలో పేర్చి.. ఆ సిలిండర్లను కారు సీట్ల మధ్యలో ఉంచి రవాణా చేస్తున్నారు. సరిగ్గా మేడ్చల్ జాతీయ రహదారి వద్దకు చేరుకోగానే.. పోలీసుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. మొదట కార్ల సీట్ల వద్ద గంజాయి బయటపడగా.. ఆ తర్వాత ముఠాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. సీఎన్‌జీ సిలిండర్లలో గంజాయి రవాణా చేస్తున్న విషయం బయటపడింది. దీంతో నిందితుల నుంచి రూ. 19.5 లక్షల విలువైన గంజాయితో పాటు రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాదకద్రవ్యాలను నిరోధించేందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు మేడ్చల్ డీసీపీ. ఎవ్వరికైనా మత్తు ముఠాల సమాచారం తెలిస్తే.. డయిల్ 100, సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ 949061744, మాదకద్రవ్యాల నిరోధక విభాగం 7901105423 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని మేడ్చల్‌ డీసీపీ నిఖిత పంత్‌ తెలిపారు.