Hyderabad: మందుబాబులకు దిమ్మతిరిగే షాక్.. హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం.. దందా గురించి తెలిస్తే షాకే..
హైదరాబాద్‌లో ఓ వార్త గందరగోళాన్ని రేపింది. ఇన్ని రోజులు ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేసిన మందంతా నకిలీదేననని తేలింది. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లాంటి శివారు ప్రాంతాల్లో ఉన్న మద్యం ప్రియులు సేవించింది ఈ నకిలీ సరుకేనట.
హైదరాబాద్‌లో ఓ వార్త గందరగోళాన్ని రేపింది. ఇన్ని రోజులు ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేసిన మందంతా నకిలీదేననని తేలింది. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లాంటి శివారు ప్రాంతాల్లో ఉన్న మద్యం ప్రియులు సేవించింది ఈ నకిలీ సరుకేనట. రోజూ తాగేవాళ్లకు, ఫంక్షన్లకు, దావత్‌లకు అంతేందుకు మొన్న జరిగిన మునుగోడు ఉపఎన్నికకు కూడా.. హైదరాబాద్ నుంచి ఈ నకిలీ మందునే సరఫరా చేసినట్టు సమాచారం. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్ని రోజులు తాగిందంతా నకిలీ మందా అంటూ నాలుక కురుచుకోవటం మద్యం ప్రియులవంతైంది. మందుబాబుల గుండెపగిలే ఈ నగ్నసత్యం ఓ చిన్న బెల్ట్ షాపు ద్వారా బయటపడటం గమనార్హం.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ఇంకేముంది వెంటనే రంగంలోకి దిగిన బృందం హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సైలెంట్‌గా వెళ్లారు. సాధారణ మద్యం కొనుగోలుదారుల్లా వెళ్లి.. బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అవి నకిలీవిగా గుర్తించారు. ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా దీని వెనుక పెద్ద దందానే నడుస్తోందన్న విషయం బయటపడింది.
ఆ బెల్ట్ షాప్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు.. పెద్దఅంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌ని గుర్తించారు. ఆ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌లో సుమారు రెండు కోట్లకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఈ డంప్ అంతా దేవలమ్మ నాగారానికి చెందిన ఓ బడా మద్యం వ్యాపారి బింగి బాలరాజు గౌడ్‌కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వెంటనే బింగి బాలరాజు గౌడ్‌ను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..