AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉప్పల్‌లో భారత్, బంగ్లా మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ సుధీర్ బాబు

India vs Bangaldesh: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో త్వరలో జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికార్లతోపాటు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Hyderabad: ఉప్పల్‌లో భారత్, బంగ్లా మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ సుధీర్ బాబు
Rachakonda Cp Sudhir Babu
Venkata Chari
|

Updated on: Oct 05, 2024 | 9:29 AM

Share

India vs Bangaldesh: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో త్వరలో జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికార్లతోపాటు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు.

ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు.

ఈ సమావేశంలో డీసీపీ మల్కాజ్ గిరి పద్మజ, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు, హెచ్‌సీఏ వైస్ ప్రెసిడెంట్ దల్జీర్ సింగ్, డీసీపీ ఎస్బి కరుణాకర్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, అడిషనల్ డీసీపీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
జస్ట్ నీళ్లేగా అనుకునేరు.. పవర్‌హౌస్.. ఉదయాన్నే తాగితే..
జస్ట్ నీళ్లేగా అనుకునేరు.. పవర్‌హౌస్.. ఉదయాన్నే తాగితే..