Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పూటకో మోసం.. రోజుకో నేరం.. రాజస్థాన్ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ ముఠా

సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) పంథా మార్చుకుంటున్నారు. నేరాలు చేయడంలో రోజురోజుకు పద్ధతి మారుస్తూ బాధితులను నట్టేట ముంచుతున్నారు. మాయమాటలతో ఎర వేసి ఉన్నకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల...

Hyderabad: పూటకో మోసం.. రోజుకో నేరం.. రాజస్థాన్ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ ముఠా
Cyber
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 05, 2022 | 10:38 AM

సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) పంథా మార్చుకుంటున్నారు. నేరాలు చేయడంలో రోజురోజుకు పద్ధతి మారుస్తూ బాధితులను నట్టేట ముంచుతున్నారు. మాయమాటలతో ఎర వేసి ఉన్నకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సాప్ డీపీగా ఉంచి, ఉన్నతాధికారులకు ఫేక్ మెయిల్స్‌ పంపుతున్నారు. తాము చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేయాలని కోరుతున్నారు.ఈ తరహాలోనే తెలంగాణ(Telangana) రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, గిరిజనశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు సహా నలుగురు ఐఏఎస్‌ల వాట్సాప్‌ డీపీలతో మోసాలకు పాల్పడ్డారు సైబర్ నేరస్థులు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వివరాలు, వారి ఫొటోలను ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి సేకరించి, వారి మెయిళ్లలో మార్పులు చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు మెయిల్‌కు వాట్సాప్‌(Whatsapp) నంబర్లు పంపించగానే ఐఏఎస్‌, ఐపీఎస్‌ పేరుతో ఒక వాట్సాప్‌ నంబరు తీసుకుంటున్నారు. ట్రూకాలర్‌లో సదరు అధికారి పేరు వచ్చేలా ఫొటోను డీపీగా ఉంచుతున్నారు.

అనంతరం ఆ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు అత్యవసరంగా నగదు అవసరమని, ఈ ఖాతా నంబరుకు నగదు బదిలీ చేయాలంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. నిజంగా.. తమ ఉన్నతాధికారులే పంపించారన్న భావనతో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు ఒక్కొక్కరూ రూ.50వేల చొప్పున డబ్బు పంపించారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇలా నేరాలకు పాల్పడుతున్న వారు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ కేంద్రంగా ఉన్నారని గుర్తించి, దర్యాప్తు ముమ్మరం చేశారు.

తీరా అసలు విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి వచ్చిన మెసేజ్ లను నిజమని భావించి, డబ్బులు పంపించామని చెబుతున్నారు. తాము మోసపోయామంటూ సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఉన్నతాధికారుల నుంచి డబ్బు పంపాలంటూ మెయిళ్లు వస్తే. వాటిని పరిశీలించాలని చెబుతున్నారు. ఎక్కడి నుంచి మెయిల్‌ వచ్చిందనే విషయాన్ని చూడాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

PM Modi Europe Visit: ముగిసిన ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన.. ఎవరెవరిని కలిసారంటే!

Andhra Pradesh: బైక్ పై కుమారుడి మృతదేహం తరలింపు.. నెల్లూరు జిల్లాలో రుయా తరహా ఘటన