నాచారం చోరీ కేసు.. నేపాలీ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో దోపిడీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పనిమనుషులుగా చేరిన ఈ గ్యాంగ్

నాచారం చోరీ కేసు.. నేపాలీ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 26, 2020 | 3:38 PM

Nacharam Robbery Case: హైదరాబాద్‌లో దోపిడీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పనిమనుషులుగా చేరిన ఈ గ్యాంగ్‌… నాచారంలో ఈనెల 19న దోపిడీకి పాల్పడింది. 10 లక్షల నగదు, 9 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లింది. వారం రోజుల్లో 25 టీమ్‌లతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఈ గ్యాంగ్‌లో కీలక మెంబర్స్‌ను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి లక్షా 90 వేల నగదు, తొమ్మిది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 8 మంది సభ్యులు కలిగిన ఈ నేపాలీ గ్యాంగ్‌లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ చెప్పారు. ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారని అన్నారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు అర్జున్‌ కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు.

Read More:

సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు: క్షమాపణలు కోరిన నిందితుడు

బీజేపీలో చేరిన ‘బిగ్‌బాస్ 3’ కంటెస్టెంట్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu