AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistani Arrest: శంషాబాద్‌లో ఎయిర్‌ పోర్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ దేశస్తుడు అరెస్ట్‌… అసలు ట్విస్ట్‌ ఏంటంటే..

Afghanistani Arrest In Shamshabad: హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్‌ షఫీ ఇబ్రహీఖిల్‌ అనే వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు...

Afghanistani Arrest: శంషాబాద్‌లో ఎయిర్‌ పోర్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ దేశస్తుడు అరెస్ట్‌... అసలు ట్విస్ట్‌ ఏంటంటే..
Airport
Narender Vaitla
|

Updated on: Mar 19, 2021 | 10:36 PM

Share

Afghanistani Arrest In Shamshabad: హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్‌ షఫీ ఇబ్రహీఖిల్‌ అనే వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా విమానంలో హర్యాణలోని ఫిరీదాబాద్‌ వెళ్లేందుకు ఇబ్రహీఖిల్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అయితే అతనిపై అనుమానం వచ్చిన పోలీసుల అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తి దగ్గర భారత దేశానికి సంబంధించిన ఆధార్‌ కార్డు గుర్తించారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన P03549256 పాస్‌పోర్ట్‌తో ప్రయాణిస్తుండగా. అతని వద్ద 695523883716 నెంబర్‌ గల ఆధార్‌ కార్డును గుర్తించారు. ఆధార్‌ కార్డులో సఫియుల్లా పేరుతో ఢిల్లీలోని లాజ్‌ పత్‌ నగర్‌కు చెందిన అడ్రస్‌ ఉండడం గమనార్హం. దీంతో అలెర్ట్‌ అయిన పోలీసులు నిందితుడిని విచారించారు. అయితే అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో అతనిపై Cr.No.118/2021U/S, 420,468 ఐపిసి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి భారత్‌కు చెందిన సఫియుల్లానా.. లేదా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షఫీ ఇబ్రహీఖిలా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Also Read: తీగ లాగితే డొంక కదులుతోంది.. గసగసాల సాగుతో ఘాటు దందా.. రంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ ఓపీఎం పంటసాగు

చరిత్ర సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డ్.

YS Sharmila: వైఎస్ షర్మిలతో ప్రముఖుల భేటి.. రాజకీయ ప్రమేయం లేదంటున్న సెలబ్రిటీలు.!