Chinna Jeeyar Swamy: ట్రంప్‌పై దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిన్న జీయర్ స్వామి

యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడిని పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత చిన్న జీయర్ స్వామి ఖండించారు.. ట్రంప్‌పై కాల్పులు జరగడం.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అతని క్షేమం గురించి విన్న తర్వాత.. కాస్త ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.

Chinna Jeeyar Swamy: ట్రంప్‌పై దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిన్న జీయర్ స్వామి
Chinna Jeeyar Swamy -Donald Trump
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2024 | 5:03 PM

అగ్రరాజ్యం అమెరికాలో గన్‌కల్చర్‌ ప్రాణాలు తీస్తోంది. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం కాల్పుల ఘటనల్లో బాధితులుగా మారుతున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటన అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. అయితే.. యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడిని పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత చిన్న జీయర్ స్వామి ఖండించారు.. ట్రంప్‌పై కాల్పులు జరగడం.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అతని క్షేమం గురించి విన్న తర్వాత.. కాస్త ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. రాజకీయంగా జరిగినా లేదా మరేదైనా ఉగ్రవాద కార్యకలాపాలైనా ఖచ్చితంగా ఖండించాల్సిందే అంటూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం చిన్న జీయర్ స్వామి ప్రకటన విడుదల చేశారు.

‘‘మంచి సంకల్పం ఉన్నవారు భగవంతుని దయతో రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను దేశీయ, అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాల నుంచి రక్షించడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రక్షించాలని దేవుడు ఉద్దేశించాడు.. ట్రంప్‌పై నిన్న జరిగిన హత్యా ప్రయత్నం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. అతని క్షేమం గురించి విన్నప్పుడు మేము ఉపశమనం పొందాము. రాజకీయంగా లేదా మరేదైనా ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా ఖండించాలి.

బలమైన, స్థిరమైన, శాంతియుత ప్రజాస్వామ్యాలకు నమూనాలుగా నిలవాలని మేము యునైటెడ్ స్టేట్స్, భారత్ వంటి దేశాలను కోరుతున్నాము. మంచి నాయకులు.. మొత్తం ప్రపంచం భద్రత కోసం పాటుపడాలి.. అలాగే న్యాయం కోసం.. శాంతియుత భవిష్యత్తు కోసం ప్రార్థిద్దాం..’’ అంటూ చిన్న జీయర్ స్వామి ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా.. అమెరికాలోని పెన్సినియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్‌ గాయపడ్డారు. ట్రంప్ ముఖం, చెవులపై రక్తస్రవమైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి బాగానే ఉందని.. చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.. అయితే.. ట్రంప్ పై కాల్పులు జరిపిన వెంటనే.. షూటర్ ను రెప్పపాటులో గమనించిన సీక్రెట్ సర్వీస్ అతన్ని మట్టుబెట్టింది. నిందితుడితోపాటు.. మరొకరు చనిపోయారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని ఎఫ్బీఐ తెలిపింది.. దాడిచేసిన 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..