కొనసాగుతున్న ఆపరేషన్ ధూల్‌పేట్.. మరోమారు భారీగా పట్టుబడిన గంజాయి.. విలువెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే …

దూల్పేట్ పరిసర ప్రాంతాల్లోని జియాగూడ పురాణపుల్ కమ్మరివాడ దూల్పేట్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2.550 గంజాయిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దూల్పేట్ లో గంజాయి పై దాడులు జరుగుతున్నాయి అనే సమాచారం మేరకు గంజాయి అమ్మకం దారులు డోర్ స్టెప్ వరకు గంజాయి సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కొనసాగుతున్న ఆపరేషన్ ధూల్‌పేట్.. మరోమారు భారీగా పట్టుబడిన గంజాయి.. విలువెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే ...
Operation Dhoolpet
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 03, 2024 | 9:44 PM

ఆపరేషన్ ధూల్‌పేట్ లో భాగంగా శనివారం ఎక్సైజ్ సూపర్డెంట్ ఎన్ అంజిరెడ్డి గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దూల్పేట్ లో అమ్మకాలు రవాణా వినియోగం పై దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం 5.068 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

దూల్పేట్ పరిసర ప్రాంతాల్లోని జియాగూడ పురాణపుల్ కమ్మరివాడ దూల్పేట్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2.550 గంజాయిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దూల్పేట్ లో గంజాయి పై దాడులు జరుగుతున్నాయి అనే సమాచారం మేరకు గంజాయి అమ్మకం దారులు డోర్ స్టెప్ వరకు గంజాయి సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాంపల్లి, మాదాపూర్ గచ్చిబౌలి అత్తాపూర్ నాగల్ నగర్ ప్రాంతాల్లో గంజాయి కావాలని ఇచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి వద్ద నుంచి 2.518 గంజాయిని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.

మొత్తంగా ఫైవ్ పాయింట్ 5.068 కేజీల గంజాయి మొత్తంగా పట్టుకున్నారు. ఈ రెండు చోట్ల దాడుల్లో కమ్మర్వాడి ప్రాంతానికి చెందిన నిఖిల్ కుమార్ అఖిలేష్ సింగ్ జియాగూడకు చెందిన అరుణ్ రావు,, అమీష్,ఆశిష్, గణేష్ పి సాయికుమార్ లోను అరెస్ట్ చేశారు. ఈ కేసులోనిందితులుగా ఉన్నట్లు అంజిరెడ్డి పేర్కొన్నారు. గంజాయి దాడుల్లో అంజిరెడ్డి తో పాటు ఎక్సైజ్ సిఐలు మధుబాబు గోపాల్,ఎమ్మార్పీ చంద్రశేఖర్ భాస్కర్ రెడ్డి నాతో పాటు ఉమామహేశ్వరరావు సాయి కిరణ్ అజీజ్ ప్రకాష్ మహేష్ రాకేష్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్నందుకు సీఐలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హసన్ రెడ్డి అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..