Hyderabad: అర్ధరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన కంటైనర్.. ఆపి లోపల చెక్ చేయగా..

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించింది.. దీంతో పోలీసులు వెంబడించి ఆపి చెక్ చేశారు.. ఈ క్రమంలో 8క్వింటాళ్ల గంజాయ్ గుట్టు బయటపడింది.. సుమారు మూడు కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ SOT పోలీసులు తెలిపారు.

Hyderabad: అర్ధరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన కంటైనర్.. ఆపి లోపల చెక్ చేయగా..
Ganja
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 04, 2024 | 9:18 AM

పారాహుషార్‌.. భాగ్యనగరంలో గంజాయి గుప్పుమన్నది. ఏ రేంజ్‌లో పట్టుబడిందో తెలిస్తే షాక్‌ అవుతారు. ఏకంగా 800 కిలోల గంజాయి. డ్రగ్స్‌ మీద ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో 8క్వింటాళ్ల గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది.. ఆదివారం శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్‌లో ఏకంగా 800 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్‌ మండలం పెద్దగోల్కొండలో పోలీసుల తనిఖీల్లో ఇది బయటపడింది. ఒడిశా నుంచి ఈ గంజాయిని ఒక ముఠా తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కంటైనర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒడిశా నుంచి ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ఫోకస్‌ చేస్తున్నారు.

ఛేజ్ చేసి..

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించింది.. దీంతో పోలీసులు వెంబడించి ఆపి చెక్ చేశారు.. ఈ క్రమంలో 8క్వింటాళ్ల గంజాయ్ గుట్టు బయటపడింది.. సుమారు మూడు కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ SOT పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. సినిమా తరహాలో గంజాయిని తరలిస్తుండగా.. పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో సైతం పోలీసులు గంజాయిపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. ఈ క్రమంలో గంజాయిని, డ్రగ్స్‌ని అరికట్టడానికి తెలుగురాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం కోసం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ చూపారు. దీంతో గంజాయి రవాణాను అడ్డుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇన్ని చెక్‌పోస్టులు దాటి ఒడిశా నుంచి హైదరాబాద్‌దాకా ఈ గంజాయి కంటైనర్‌ ఎలా వచ్చింది అనే అంశం కీలకంగా మారింది. ఇంత పోలీసుల నిఘా మధ్య ఇన్ని వందల కిలోమీటర్లు గంజాయిని కంటైనర్‌లో ఎలా తరలించారు అనేది చర్చనీయాంశం అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..