AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIG BREAKING: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఉండదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..

Telangana Lockdown News: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు...

BIG BREAKING: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఉండదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..
Kcr On Prc
Ravi Kiran
|

Updated on: Mar 26, 2021 | 2:10 PM

Share

Telangana Lockdown News: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. స్కూల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం మూసివేశామని.. అది కూడా తాత్కాలికమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌పై తమ ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని.. పరిశ్రమలను కూడా మూసివేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ఆయన అన్నారు. సెల్ఫ్ డిసి‌ప్లేన్‌తో కరోనాను నియంత్రించవచ్చునని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ బెస్ట్ అని తెలిపిన సీఎం.. దేశంలోనే అత్యధిక టెస్టులు చేశామని తెలిపారు.

గతేడాది లాక్‌డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న సీఎం.. మాయదారి కరోనా యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు. తక్కువ మంది అతిధులతో పెళ్లిళ్లు నిర్వహించుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణలో కొత్తగా 518 కేసులు నమోదు…

తెలంగాణాలో కొత్తగా 518 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24గంటల్లో ముగ్గురు కరోనాతో మరణించగా.. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1683కి చేరింది. ప్రస్తుతం తెలంగాణాలో 3,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అటు ఇప్పటిదాకా 2,99,631 వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:

రెండో వన్డే: రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఔట్.. సూర్యకుమార్ యాదవ్ ఇన్.. టీమిండియాలో మార్పులు..

పిట్టగోడపై కాకి ‘క్యాట్ వాక్’.. అమ్మాయిలను మించి హోయలు ఒలకబోసింది.. మీరూ లుక్కేయండి.!