Telangana Coronavirus Update: మళ్ళీ తెలంగాణలో కరోనా కల్లోలం.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
మనదేశంలో కరోనా అడుగు పెట్టి దాదాపు 14 నెలలు అయినా ఇప్పటి వరకూ విజృంభణ తగ్గలేదు. కొన్ని రోజులు నెమ్మదించిన కోవిడ్ మళ్ళీ గత కొన్ని రోజులుగా...
Telangana Coronavirus Update: మనదేశంలో కరోనా అడుగు పెట్టి దాదాపు 14 నెలలు అయినా ఇప్పటి వరకూ విజృంభణ తగ్గలేదు. కొన్ని రోజులు నెమ్మదించిన కోవిడ్ మళ్ళీ గత కొన్ని రోజులుగా కల్లోలం మొదలు పెట్టింది.. తాజగా తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 518 నమోదయ్యాయని ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక గత 24 గంటల్లో 57,548 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24గంటల్లో ముగ్గురు కరోనాతో మరణించారని దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1683కి చేరింది. ఐతే ఒక్కరోజే 204 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో 3,995 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఎనిమిది రోజులా రెట్టింపు కేసులు నమోదవుతూ.. తెలంగాణాలో కరోనా మళ్ళీ విజృంభిస్తూ ఆందోళన రేకెత్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 157 కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రస్తుతం వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యశాఖ చెబుతోంది. అయితే ప్రస్తుతం కొవిడ్ చికిత్సలపై స్పష్టత ఏర్పడడంతో.. బాధితులను త్వరగా గుర్తించి స్థానికంగానే నయం చేయడానికి అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Also Read: కార్తీక్ తన బాధను చెప్పుకోవడానికి మాత్రమే మీరు కావాలి అంటూ హిత బోధ చేసిన పనిమనిషి