Karthika Deepam: కార్తీక్ తన బాధను చెప్పుకోవడానికి మాత్రమే మీరు కావాలి అంటూ హిత బోధ చేసిన పనిమనిషి

మురళీకృష్ణ తో కలిసి శౌర్య, హిమలు భోజనం చేస్తూ.. ఎంతో సంతోషంగా ఉంటారు. తండ్రి గురించి పిల్లలు అడిగితె.. నాకు మీ నాన్నా అర్ధం కాలేదు.. మీ అమ్మే చెప్పాలి..

Karthika Deepam: కార్తీక్ తన బాధను చెప్పుకోవడానికి మాత్రమే మీరు కావాలి అంటూ హిత బోధ చేసిన పనిమనిషి
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2021 | 10:41 AM

Karthika Deepam: కార్తీక దీపం రోజుకో ట్విస్ట్ తో టాప్ రేటింగ్ తో దూసుకు పోతుంది. ఈరోజు (మార్చి 26 -2021) 997 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈ రోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..!

మురళీకృష్ణ తో కలిసి శౌర్య, హిమలు భోజనం చేస్తూ.. ఎంతో సంతోషంగా ఉంటారు. తండ్రి గురించి పిల్లలు అడిగితె.. నాకు మీ నాన్నా అర్ధం కాలేదు.. మీ అమ్మే చెప్పాలి.. మీ నాన్న అంటే ఏమిటో.. అని అంటాడు.. దీప కార్తీక్ గురించి మాట్లాడుతూ.. మీ నాన్న దేవుడు అంటుంది. మీ ప్రేమే మీ నాన్నను తీసుకొస్తుంది అని అంటుంది దీప..

ఇంతలో ప్రియమణి మోనిత తో కొన్ని నిజాలు మాట్లాడతా అంటా.. అని అంటుంది.. మోనిత చెప్పు అనడంతో.. కార్తీక్ కు మీరు అంటే ప్రేమ లేదు.. ఎంతసేపు మీరు ప్రేమించడం… పెళ్లి చేసుకుంటా అని అడగడం తప్ప.. ఏ రోజైనా కార్తీక్ మిమ్మల్ని ప్రేమగా చూశాడా..? కార్తీక్ అయ్యకు తన కష్టాలు చెప్పుకోవడానికి వేరే దిక్కులేక ఇక్కడకు వస్తున్నాడు కానీ.. మీరే దిక్కు అని మాత్రం మాత్రం కాదమ్మా .. హిమని తీసుకొస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడు కానీ.. మీ మీద ప్రేమతో కాదు.. రేపు హిమ అమ్మ కావాలి అని దీపని తీసుకుని రండి అంటే.. ఆయమ్మని తెచ్చుకుని ఏలుకోడు అని గ్యారెంటీ ఏమిటి..? అంటూ ప్రశ్నిస్తుంది. అయినా మీ మధ్య హిమ ఏమిటమ్మా.. కార్తీక్ అయ్య తలచుకుంటే తాళి కట్టెయ్యొచ్చుగా అని మోనిత కు మంచి చెప్పడానికి ట్రై చేస్తుంది. అయినా ఏ నాడైనా మీతో ప్రేమగా మాట్లాడడా .. మీ దగ్గర తల్లిని ఓ భుజంపై.. పెళ్ళాన్ని మరో భుజంపై మోస్తాడు కానీ మీరు ఏమైనా అంటే ఊరుకోడు అయినా ఈ మధ్య మీ మాటలు వినడం మానేశారు కూడా అంటుంది ప్రియమణి. దీంతో మోనిత టెన్షన్ పడుతూ.. నా ఆశల సౌధం కూలిపోయిందా అనుకుంటూ టెన్షన్ పడుతుంది.

ఇక కార్తీక్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని రావడానికి ఆస్పత్రికి వస్తాడు.. కారులో కూర్చుని మళ్ళీ ఆలోచించుకుంటాడు.. రిపోర్ట్స్ ఎప్పటిలా వస్తే.. అమ్మ ఎప్పుడు ఇక పిల్లల్ని తెచ్చుకోవడానికి ఒప్పుకోదు.. ఎంతగా అభిమానించే దీపని కూడా ద్వేషిస్తుంది. పిల్లలు నన్ను నాన్నా అని పిలవక పొతే నేను ఉండలేను.. కనుక రిపోర్ట్స్ లో ఏమివచ్చినా నేను చూడకపోవడమే బెస్ట్ అంటూ.. వెళ్ళిపోతాడు.. వెంటనే ..మోనిత వచ్చి.. ఇదే కదా కార్తీక్ టెస్టులు చేయించుకున్న ఆస్పత్రి.. అందరూ కార్తీక్ కు తెలిసిన వాళ్ళే.. కనుక నేను రిపోర్ట్స్ మార్చాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంది.. కష్టమైన సరే అదే చెయ్యాలని నిర్ణయించుకుని లోపలి వెళ్తుంది.

మరోవైపు టిఫిన్ సెంటర్ వద్ద పిల్లలు సంతోషంగా టిఫిన్ తింటారు.. మురళీ కృష్ణ కస్టమర్స్ పెరిగారు అమ్మా అంటాడు.. అంత శౌర్య తెలివితేటలు నాన్న అంటుంది.. ఇంతలో పిల్లలు లోపలి వెళ్ళిపోతారు.. ఏమిటమ్మా ఇది పిల్లలకు వాళ్ళ నాన్నని మరపించడం కష్టంగా ఉంది.. ఇక నీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.. వెళ్లదామా అంటాడు. కోటీశ్వరుల పిల్లలు.. ఇదేమిటమ్మా.. అంటాడు .. తప్పే నాన్నా.. కానీ ఎం చేయమంటావు.. వాళ్లిద్దరూ తన పిల్లలు అనుకోవడం లేదు.. ఒకరిని పెంచుకున్నా అనుకుంటున్నాడు.. మరొకరిని అభిమానం పెంచుకున్నా అనుకుంటున్నారు.. నిజం తెలుసుకునే వరకూ వారిద్దరూ అయన దృష్టిలో వారిద్దరూ ఆయింటి వారసులు కాదు.. అంటుంది.. తండ్రిని పూర్తిగా పిల్లలకు దూరం చేద్దామని అనుకుంటున్నావా అని మురళీ కృష్ణ ప్రశ్నిస్తే.. అంత శక్తి నాలో లేదు.. అక్కడే ఉంటె.. నాన్న ఇక రాడు అనుకుని ఆయన మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది.. అదే ఇక్కడే ఉంటె.. ఎప్పటికైనా నాన్న వస్తాడు అన్న ఆశతో ఎదురుచూస్తారు అంటుంది దీప.

ఇక కార్తీక్ సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య లు మౌనంగా టిఫిన్ తింటారు.. అయితే ఇంతలో ఆనందరావు మౌనం రాజ్యం ఏలుతుంది అని అంటాడు.. ఆ రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు మీ సుపుత్రుడే.. అంటుంది సౌందర్య.. మీ చేతి నుంచి మంత్ర దండం వెళ్ళిపోయింది.. డబ్బు ఉండి కూడా పిల్లలని దీప ని ఇంటికి తీసుకుని రాలేకపోతున్నాను.. అంటదు ఆనందరావు.. శ్రావ్య పేపర్ లో ప్రకటన ఇద్దామని సలహా ఇస్తుంది.. ఆమ్మో అన్నయ్య కిరీటం పడిపోతుంది. అంటాడు ఆదిత్య.. పిల్లలు ఏ చిగిరిన బట్టల్లోలో ఉంటారు.. అంటే.. దీప తను తినకపోయినా పిల్లలకు ఏ లాఠీ రానీయదు.. అంటాడు. కార్తీక్.. వెంటనే సౌందర్య నీకో దండం.. నేను నీతో వాదించలేను నాయనా అంటుంది. దీంతో దీప వంటలక్క అని తెలిసినపుడే బెంగతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఇప్పుడు నేను కనిపించక బెంగపెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటే.. కార్తీక్ .. నేను ఏమీ పిల్లలని పుట్టుకతో ముడిపెట్టి దూరం పెట్టలేదు.. అదే తన బిడ్డలను అడ్డు పెట్టుకుని నాతో కనపడని బేరం మొదలు పెట్టింది అంటాడు.. వీరు మారడు.. ఆ మాటలు మారవు.. కంఠశోష తప్ప ఏం ఉపయోగం ఉండదు.. కనపడని బేరం మొదలుపెట్టిన నా కోడలు.. కనిపించకుండా ఎందుకు వెళ్లిపోయిందా అని కూడా ఆలోచించని ఈ అజ్ఞానితో నేను వాదించలేను అంటూ ఆనందరావు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు..

వెంటనే సౌందర్య ‘ఒరేయ్ జ్ఞానిలా ఫీల్ అయ్యే అజ్ఞాని.. మీ నాన్న అన్నదానికి సమాధానం చెప్పరా.. అసలు ఎక్కడ ఉందొ తెలియకూడదనే కదా ఫోన్ కూడా ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలో ఉంది. దానికి పిల్లలు భారం అనుకుంటే కదా బేరం మొదలుపెట్టేది? నువ్వేరా పెంచిన ప్రేమని అడ్డంపెట్టుకుని దాని పిల్లల్ని లాక్కుని… దాని చావు అది చస్తుందేలే అని అనుకుంటున్నావు. ఆస్తి రాసిస్తాను అంటున్నావా..? అది తీసుకుంటుందా? తీసుకోదని నీకు తెలియదా?’ అసలు ఆస్తి కోసం పిల్లల్ని అమ్ముకునే నీచానికి స్టేజ్ కు అమ్మని దిగజార్చకురా అని కార్తీక్ పై మండిపడుతుంది సౌందర్య. కార్తీక్ నా బిడ్డకావాలంటే ఏమి చెయ్యాలో తెలియడం లేదు .. మమ్మీ.. నేను పిల్లలకు అన్యాయం చేశానా.. నేను హిమ అనాథని తెలిసినప్పుడు ఎలా ప్రేమించానో.. దీప కూతురు అని తెలిసాక కూడా అంతె ప్రేమించాను కదా..! శౌర్య దీప కూతురు అని తెలిసినా దానిని ఏనాడైనా బాధపెట్టే మాట అన్నానా..! అయితే అమ్మగా ఒక పరిష్కారం చెప్పనా.. నేను ఒక మాట చెబుతాను అంటుంది సౌందర్య.. చెప్పు అనగానే.. దీప నీకు భార్యగా అక్కర్లేదు.. కానీ నాకు నా కోడలు కావాలి.. ఆ పిల్లలకు తల్లిగా తీసుకుని రా.. అంటుంది.. మోనిత మళ్ళీ రిపోర్ట్స్ రిజల్ట్ ను చేంజ్ చేసిందా.. ఎప్పటికీ మోనిత మాటలే వింటాడా చూడాలి మరి.

Also Read: రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు.. కొనసాగుతోన్న భారత్ బంద్.. వాటికే అనుమతి.!

అందాల కృతికి అవకాశాల వెల్లువ.. తక్కువ టైమ్ లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?