AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Student Suicide: ప్రాణం తీసిన ప్రేమ.. వైద్య విద్యార్థి బలవన్మరణం.. సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన..

Medical Student Suicide: ప్రేమలో విఫలమైనందుకు కొంతమంది విద్యార్థులు అనవసరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితం మొత్తం ముగిసినట్టుగా భావించి సూసైడ్

Medical Student Suicide: ప్రాణం తీసిన ప్రేమ.. వైద్య విద్యార్థి బలవన్మరణం.. సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన..
Student Suicide
uppula Raju
|

Updated on: Mar 26, 2021 | 9:06 AM

Share

Medical Student Suicide: ప్రేమలో విఫలమైనందుకు కొంతమంది విద్యార్థులు అనవసరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితం మొత్తం ముగిసినట్టుగా భావించి సూసైడ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను కారణాలుగా చూపి ఆత్మహత్య చేసుకుంటున్నారు.కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి సిద్ధిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

లవ్ ఫెయిల్యూర్ కావడంతో మనస్తాపం చెందిని ఓ వైద్య విద్యార్థి హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల మధిర గ్రామమైన పీసీ తండాకు చెందిన మెగావత్‌ సంతోష్‌కుమార్‌(21) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పరీక్ష ఉందని కాలేజీకి వెళ్లాడు. అక్కడ కొద్దిసేపు గడిపి తిరిగి హాస్టల్‌కి వచ్చాడు.

హాస్టల్‌కి వచ్చిన సంతోశ్ తన గదిలోకి నిరాశగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి గమనించిన విద్యార్థులు వార్డెన్‌కు చెప్పడంతో ఆయన పోలీసులకు తెలియజేశాడు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గదిని తనిఖీ చేయగా సూసైడ్ లెటర్ దొరికింది. ప్రేమలో విఫలమైనందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

కాల్ పేరుతో కనెక్ట్ అయ్యాడు.. చనువుగా మాట్లాతుండటంతో రెచ్చిపోయాడు.. సీన్ కట్ చేస్తే జైలుపాలయ్యాడు..

Google Meet: ‘గూగుల్‌ మీట్‌’లో ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవుతున్నారా.? అయితే ఈ ఫీచర్‌ మీకు బాగా ఉపయోగపడుతుంది.

Mao Attack : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోల విధ్వంసం.. రహదారి పనులకు వినియోగిస్తున్న 17 వాహనాల దగ్ధం..

Bharat Bandh Today Live: రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు.. కొనసాగుతోన్న భారత్ బంద్.. వాటికే అనుమతి.!