Mao Attack : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోల విధ్వంసం.. రహదారి పనులకు వినియోగిస్తున్న 17 వాహనాల దగ్ధం..
Mao Attack : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు. రహదారి పనులు చేస్తున్న సూపర్ వైజర్‌ను బెదిరించి వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న
Mao Attack : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు. రహదారి పనులు చేస్తున్న సూపర్ వైజర్‌ను బెదిరించి వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసు బృందాలు అక్కడికి భారీగా తరలివెళ్లాయి.. వివరాలు ఇలా ఉన్నాయి. కొండగావ్ జిల్లాలో నక్సల్స్ బరితెగించారు. కేస్కల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కుయమారి వద్ద పీయంజీఎస్ వై పథకం కింద రహదారి విస్తరణ పనులు చేస్తున్న 17 వాహనాలకు నిప్పంటించారు. సూపర్ వైజర్‌ను తుపాకీతో బెదిరించి కాంట్రాక్టర్ పేరు తెలుసుకున్నారు. అంతేకాకుండా అతన్ని చంపుతామని హెచ్చరించారు. అక్కడ ఉన్న 20 మంది కూలీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కూలీల సమక్షంలోనే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆయిల్ తీసి టిప్పర్లకు, ట్రాక్టర్లను, జేసీబిలను దగ్దం చేశారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రక్షణ బృందాలను భారీగా మోహరించారు.
పద్దతి మార్చుకున్న మావోయిస్టులు కొత్త కొత్త పద్దుతుల్లో అటాక్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మావోయిస్టులు అత్యాధునిక మారణాయుధాలను సమకూ ర్చుకుంటున్నారు. ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, యూబీజీ వంటి ఆయుధాలను వినియోగిస్తూ వస్తున్న మావోయిస్టులు ప్రస్తుతం సొంత సాంకేతికత పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయు ధాలను తయారు చేసుకుంటున్నట్లు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
గతంలో వచ్చిన హాలీవుడ్ హిట్ సినిమా ‘రాంబో’లో నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ తనను పట్టుకునేందుకు వచ్చిన శత్రువులపై బాంబు బాణాలు, మోర్టార్లతో దాడి చేస్తాడు. అదే సీన్‌ను చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా డోర్నపాల్‌లో జరిగిన మెరుపుదాడిలో మావోయిస్టులు రిపీట్ చేశారు. రాంబో సినిమాలో మాదిరి గానే బాణాలకు ఐఈడీ బాంబులు కట్టి ప్రయోగించారు. రాజమండ్రి-జగదళ్‌పూర్ హైవేలో ఓ వాహనంపై బాణం బాంబ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి :