కాల్ పేరుతో కనెక్ట్ అయ్యాడు.. చనువుగా మాట్లాతుండటంతో రెచ్చిపోయాడు.. సీన్ కట్ చేస్తే జైలుపాలయ్యాడు..

ఓ యువతి చిన్న పొరపాటు ఆమెను కష్టాల్లోకి నెట్టింది. టెలికాలర్ గా పని చేస్తున్న యువతిని కస్టమర్ వేధింపులకు గురిచేశాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి వెళ్ళాడు.

కాల్ పేరుతో కనెక్ట్ అయ్యాడు.. చనువుగా మాట్లాతుండటంతో రెచ్చిపోయాడు.. సీన్ కట్ చేస్తే జైలుపాలయ్యాడు..
Man Held For Harassing
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2021 | 8:56 AM

ఓ యువతి చిన్న పొరపాటు ఆమెను కష్టాల్లోకి నెట్టింది. టెలికాలర్ గా పని చేస్తున్న యువతిని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి వెళ్ళాడు. నిత్యం కస్టమర్ కేర్ నుంచి అనేక ఫోను వస్తుంటాయి. తమ సంస్థ కు సంబంధించిన వివరాలను తెలుపుతూ నిత్యం ఫోన్లు మెసేజ్ లు వస్తుంటాయి. అయితే టెలికాలర్ లు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లను కస్టమర్ లకు ఇవ్వరు. కానీ ఇక్కడ ఓ యువతి అదే తప్పు చేసి వేధింపులకు గురైంది.

సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతి ప్రముఖ కంపెనీలో టెలికాలర్ గా పనిచేస్తుంది. నిత్యం పదుల సంఖ్యలో కస్టమర్ లతో మాట్లాడే ఆమె ఓ రోజు ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తమ సంస్థ కు సంబంధించిన విషయాల గురించి వివరించింది. అయితే ఆ వ్యక్తి తనకు కాస్త సమయం కావాలని కోరాడు. అలాగే ఆ సంస్థకు కస్టమర్ గా మారడానికి ఆసక్తిగా ఉన్నానని.. మరిన్ని వివరాలకోసం వ్యక్తిగత నెంబర్ ఇవ్వమని అడిగాడు. దాంతో ఆమె తన ఫోన్ నెంబర్ ను ఇచ్చింది. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలు పెట్టాడు. అసభ్యకర మెసేజ్ లు, సమయం కాని సమయంలో కాల్స్ చేస్తూ వేధించసాగాడు. ఒకానొక సందర్భంలో న్యూడ్ వీడియోకాల్ చేసి ఆమెను వేధించాడు. దాంతో ఆమె సిటీ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mao Attack : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోల విధ్వంసం.. రహదారి పనులకు వినియోగిస్తున్న 17 వాహనాల దగ్ధం..

కన్నడనాట రాసలీలల వ్యవహారం మరో ట్విస్ట్.. రెండో సీడీని విడుదల చేసిన యువతి.. అందులో ఏముందంటే..?

బరితెగించిన బడిపంతులు.. బడిలోనే బార్ తెరిచాడు.. మద్యం సేవిస్తూ విద్యార్థుల పట్ల వికృత చేష్టలు