కన్నడనాట రాసలీలల వ్యవహారం మరో ట్విస్ట్.. రెండో సీడీని విడుదల చేసిన యువతి.. అందులో ఏముందంటే..?

కన్నడనాట రాసలీలల సీడీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సీడీలో కనిపించిన యువతి గురువారం మరో సీడీ విడుదల చేయడంతో కలకలం రేగింది.

కన్నడనాట రాసలీలల వ్యవహారం మరో ట్విస్ట్.. రెండో సీడీని విడుదల చేసిన యువతి.. అందులో ఏముందంటే..?
Karnataka Woman Releases Second Video Doubting Sit's Credibility
Follow us

|

Updated on: Mar 26, 2021 | 8:29 AM

Karnataka sex scandal: కన్నడనాట రాసలీలల సీడీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సీడీలో కనిపించిన యువతి గురువారం మరో సీడీ విడుదల చేయడంతో కలకలం రేగింది. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని ఆమె కోరుతూ వీడియో విడుదల చేసింది. అంతేకాదు, ఈ కేసులో సిట్‌ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని ఆరోపించారు.

కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహోళి యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిని లోబర్చుకున్నారని మోసం చేశారని ఆడియో, వీడియో సంచలనంగా మారింది. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆ యువతి పట్ల సదరు మంత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించి సీడీని బయటకు రావడంతో కర్ణాటక వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించింది.

తాజాగా ఆ యువతి మరో సీడీ విడుదల చేసింది. “నేను తప్పు చేయలేదని నా తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు. అందుకే వారు పోలీసు కేసు పెట్టలేదు. ఎవరో బలవంతంగా కేసు పెట్టించినట్లు ఉంది” అని తాజా సీడీలో ఆమె పేర్కొన్నారు. ‘నా తల్లిదండ్రులు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విషయం తెలిశాక సిట్‌ విచారణకు హాజరవుతాను. నా వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని వారికి అందించేందుకు సిద్ధం’ అని తెలిపారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌, వివిధ మహిళా సంఘాలను కోరారు. ఎవరిని రక్షించేందుకు సిట్‌ ప్రయత్నిస్తోందో అయోమయంగా ఉందని ఆమె ఆరోపించారు.

మరోవైపు, మొదట్లో రక్షణ కల్పించాలని తనను కోరగా.. పూర్తి రక్షణ ఇస్తామని చెప్పామని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలను ఎందుకు రక్షణ కోరుతున్నారో తెలియట్లేదని హోం మంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని, సిట్‌కు పూర్తి అధికారాలు ఇచ్చామని చెప్పారు. మాజీ మంత్రిని సిట్‌ అధికారులు రెండుసార్లు విచారించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కాగా, రాసలీలల సీడీ విషయంలో గందరగోళంతో బడ్జెట్‌ సమావేశాలు బుధవారమే ముందస్తుగా ముగిశాయి. మాజీ మంత్రిపై చర్యల కోసం కాంగ్రెస్‌ పార్టీ మహిళా కార్యకర్తలు, నేతలు గురువారం కూడా ఆందోళనలు కొనసాగించారు.

ఇదిలావుంటే, ఆ యువతి ఒత్తిడిలో ఉండి ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి రమేశ్‌ జార్ఖిహొళి ఆరోపించారు. ఆమె వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, సకాలంలో అన్ని ఆధారాలతో బయటపెడతానని రమేశ్ ప్రకటించారు. తనకు వ్యతిరేకంగా మరో పది సీడీలు విడుదల చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఒక మహా నాయకుడే ఈ కుట్రకు సూత్రధారి అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి.. మరికొన్ని రోజుల్లో అన్నింటినీ బహిరంగ పరుస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్‌ నాయకుల పట్ల తనకు గౌరవం ఉండేదని, తనపై అత్యాచార కేసు నమోదు చేయాలంటూ వారు చేసిన డిమాండుతో నా నమ్మకాన్ని కోల్పోయానని విరుచుకుపడ్డారు.

Read Also…  బరితెగించిన బడిపంతులు.. బడిలోనే బార్ తెరిచాడు.. మద్యం సేవిస్తూ విద్యార్థుల పట్ల వికృత చేష్టలు

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి