బరితెగించిన బడిపంతులు.. బడిలోనే బార్ తెరిచాడు.. మద్యం సేవిస్తూ విద్యార్థుల పట్ల వికృత చేష్టలు

పవిత్రమైన పాఠశాలలను పానకాలశాలగా మార్చేశాడు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి స్కూల్‌నే బార్‌గా మార్చేశాడు.

  • Balaraju Goud
  • Publish Date - 7:48 am, Fri, 26 March 21
బరితెగించిన బడిపంతులు.. బడిలోనే బార్ తెరిచాడు.. మద్యం సేవిస్తూ విద్యార్థుల పట్ల వికృత చేష్టలు
Chittoor Drinking Teacher

chittoor drinking teacher: పవిత్రమైన పాఠశాలలను పానకాలశాలగా మార్చేశాడు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి స్కూల్‌నే బార్‌గా మార్చేశాడు. విద్యార్థుల ముందే మందు కొడుతూ.. బిర్యానీ తింటూ.. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. నిలదీసిన స్థానికులపై బూతు పురాణంతో అందుకున్నాడు. అయ్యగారి భాగోతాన్ని అడగటానికి వెళ్లిన మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు.

చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించి మాంసం తింటూ బూతులు తిడుతూ అసభ్య ప్రవర్తించాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు.పిల్లలకి పాఠాలు చెప్పాల్సిందిపోయి.. విద్యార్థుల ముందే మద్యం సేవిస్తూ మత్తులో మునిగి తేలాడు. అక్కడితో ఆగిపోకుండా.. డ్రాయర్ వేసుకొని రాలేదనే కారణంతో ఓ విద్యార్థి బట్టలు విప్పించాడు.

విద్యార్థులు చేసే చిన్న చిన్న తప్పులకు బెత్తంతో కొట్టడం, ఆడ పిల్లలను బట్టలు విప్పించి తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి అనుమానిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇదేంటని అడిగిన విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కూడా సదరు టీచర్ దురుసుగా ప్రవర్తించాడు. వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ బరితెగించి ప్రవర్తించాడు.

ఉన్నత ప్రయోజకులు అవుతారని పాఠశాలకు పంపింతే విద్యార్థుల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి టీచర్ ఉన్న పాఠశాలకు మా పిల్లలను పంపేది లేదని తేల్చి చెప్పారు.

Read Also…  మదనపల్లె జంట హత్యల కేసు: కోలుకున్న పురుషోత్తంనాయుడు, పద్మజ.. మానసిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి