AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదనపల్లె జంట హత్యల కేసు: కోలుకున్న పురుషోత్తంనాయుడు, పద్మజ.. మానసిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తంనాయుడు, పద్మజలను డిశ్చార్జి అయ్యారు.

మదనపల్లె జంట హత్యల కేసు: కోలుకున్న పురుషోత్తంనాయుడు, పద్మజ.. మానసిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
Madanapalli Daughters Murder Case
Balaraju Goud
|

Updated on: Mar 26, 2021 | 7:03 AM

Share

madanapalli daughters murder case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తంనాయుడు, పద్మజలను డిశ్చార్జి చేసినట్టు విశాఖపట్నం మానసిక వైద్యశాల అధికారులు వెల్లడించారు. గత నెల నాలుగో తేదీ నుంచి చినవాల్తేరులో గల ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి మానసిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో డిశ్చార్జి చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో వారిని అధికారులు తిరిగి మదనపల్లె సబ్ జైలుకు తరలిస్తారన్నారు.

ఇద్దరు కూతుళ్లను హతమార్చి మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన దంపతులు కోలుకున్నారని.. గురువారం సాయంత్రం వైద్యుల పర్యవేక్షణలో దంపతులతో సమావేశం నిర్వహించారు. కన్న కూతుళ్ల హత్య కేసులో ఆ తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులను జనవరి 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేశారు. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో జైలులోని ఇతర ఖైదీలు భయపడిపోయారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు. పోలీసుల సమక్షంలోనే నానా రభస సృష్టించారు.

పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి ఏడ్చారు. దీంతో జైలు సిబ్బంది అధికారులతో మాట్లాడి తిరుపతి రుయాకు తరలించగా.. మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో నిందితులు పురుషోత్తం, పద్మజలను విశాఖ తరలించారు.. ఇద్దర్ని విశాఖ మానసిక చికిత్సాలయంలో చేర్చారు.