AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Employee: వారు రావడం చూశాడు.. రూ. 20 లక్షల నగుదుకు నిప్పటించాడు.. అసలేం జరిగిందంటే..

Govt Employee: మన దేశంలో అవినీతిపరులకు కొదవే లేదు. ఓవైపు వేల కొద్ది జీతాలు నెలా నెలా ఠంచనుగా తీసుకుంటున్నా.. లంచాలు..

Govt Employee: వారు రావడం చూశాడు.. రూ. 20 లక్షల నగుదుకు నిప్పటించాడు.. అసలేం జరిగిందంటే..
Currency Notes
Shiva Prajapati
|

Updated on: Mar 26, 2021 | 6:48 AM

Share

Govt Employee: మన దేశంలో అవినీతిపరులకు కొదవే లేదు. ఓవైపు వేల కొద్ది జీతాలు నెలా నెలా ఠంచనుగా తీసుకుంటున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానటం లేదు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. బాధ్యతగా చేయాల్సిన పనులకు కూడా ప్రజల నుంచి పైసలు దండుకుంటున్నారు. అయితే కొందరు అధికారులు ఇలా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ఎన్నో ఘటనలను చూశాం.. చూస్తున్నాం. కొన్ని నెలల క్రితం కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ ఎమ్మార్వో స్థాయి అధికారులే అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది. వివరాల్లోకెళితే.. ఓ కాంట్రాక్ట్ పనిని అప్పగించడం కోసం వ్యక్తి నుంచి తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ రూ. లక్ష లంచాన్ని డిమాండ్ చేశాడు.

ఈ డబ్బును నేరుగా అతను తీసుకోకుండా.. తన అనుచరుడైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్‌ ద్వారా తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు వ్యక్తి వద్ద నుంచి పర్వత్ సింగ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని, విచారించగా.. అసలు విషయాన్ని వెల్లడించాడు. దాంతో ఏసీబీ అధికారులు కల్పేష్ కుమార్ జైన్ ఇంటికి వెళ్లారు. ఏసీబీ అధికారుల రాకను పసిగట్టిన జైన్.. ఇంట్లి తలుపులు వేసుకుని లోపలివైపు తాళాలు వేసుకుని దాదాను రూ. 20 లక్షల కరెన్సీ నోట్లను కాల్చి వేశాడు. అధికారులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. అప్పటికే నోట్ల కట్టలు మంటల్లో తగులబడిపోవటాన్ని గుర్తించారు. కల్పేష్ కుమార్ జైన్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు.

Also read:

Gold And Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Fire Breaks out in Hospital: మహారాష్ట్రలో దారుణం.. కోవిడ్ కేర్ హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహం..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..