చంచల్ గూడ జైలు నాకు కొత్తేం కాదు.. మద్యం మత్తులో నైజీరియన్

మద్యం మత్తులో ఉన్న ఓ నైజీరియన్, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. అయితే ఫుల్లుగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న నైజీరియన్, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీడియాపై కూడా రాళ్లదాడికి యత్నించాడు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి చంచల్ గూడ జైలుకు కూడా వెళ్లొచ్చానని దర్జాగా చెబుతున్నాడు ఈ నైజీరియన్. అయితే అతడిని పట్టుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు […]

చంచల్ గూడ జైలు నాకు కొత్తేం కాదు.. మద్యం మత్తులో నైజీరియన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 23, 2019 | 12:33 PM

మద్యం మత్తులో ఉన్న ఓ నైజీరియన్, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. అయితే ఫుల్లుగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న నైజీరియన్, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీడియాపై కూడా రాళ్లదాడికి యత్నించాడు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి చంచల్ గూడ జైలుకు కూడా వెళ్లొచ్చానని దర్జాగా చెబుతున్నాడు ఈ నైజీరియన్. అయితే అతడిని పట్టుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి.. కారును సీజ్ చేశారు.