AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: హమ్మయ్య.! ఏపీ, తెలంగాణలకు చల్లటి కబురు.. మరో ఐదు రోజుల్లో..

హమ్మయ్య.! ఎన్నాళ్లకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఎట్టకేలకు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.

Monsoon: హమ్మయ్య.! ఏపీ, తెలంగాణలకు చల్లటి కబురు.. మరో ఐదు రోజుల్లో..
Monsoon
Ravi Kiran
|

Updated on: Jun 09, 2023 | 9:41 AM

Share

హమ్మయ్య.! ఎన్నాళ్లకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఎట్టకేలకు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. జూన్ 8న ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. అయితే ఆరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 48 గంటల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి.. ఆ తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఇదే చురుకుదనంతో రుతుపవనాలు కదిలితే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోకి, అనంతరం జూన్ 15వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి జూన్ 10 కల్లా రుతుపవనాలు తెలంగాణను తాకాలి. కానీ వాతావరణ మార్పులు, తుఫాన్ కదలికల కారణంగా ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉత్తర తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి